పలావు, సమోవా, వనాటు, మార్షల్ దీవులు, టువాలు, కిరిబాటి, నౌరు, సోలమన్ దీవులు, టోంగా, మైక్రోనేషియా, ఉత్తర కొరియా, టర్క్ మెనిస్టాన్… ఇవేమిటీ అనుకుంటున్నారా? ప్రపంచ దేశాలుగా యూఎన్ఓ అధికారికంగా గుర్తించిన 193 దేశాల్లో ఇవి కూడా ఉన్నాయి. అయితే ఏంటి అంటే…?
ఆయా దేశాల్లో నిన్నటి వరకు… అంటే జూలై 19వ తేదీ వరకు సింగిల్ కరోనా కేసు నమోదు కాకపోవడమే అసలు విశేషం. ఇప్పటి వరకు కరోనా జాడే లేని ఆయా దేశాల్లో ఎక్కువ శాతం పసిఫిక్ మహాసముద్ర ద్వీపదేశాలే కావడం గమనార్హం.
ప్రపంచ దేశాలు కరోనా కల్లోల సంద్రంలో కకావికలమవుతున్న ప్రస్తుత తరుణంలో ఇప్పటి వరకు కరోనా జాడ లేని ప్రాంతాలుగా ఆయా దేశాలు ఉండడం నిజంగా అద్భుతమే కదా! ఆయా దేశాలు ఇలాగే ఉండాలని, కరోనాతో విలవిలలాడుతున్న ఇతర దేశాలు కోలుకోవాలని అభిలషిద్దాం.