‘నిజమే మహాత్మాగాంధీజీ…
దేశభక్తుడు కాకపోవచ్చు ..!!’
ఎందుకంటే…?
సుదీర్ఘ భారత స్వాతంత్రోద్యమంలో మహాత్ముడు ప్రవేశించిన తరువాత ఉద్యమ రూపురేఖలు మారిపోయాయి .
అంతవరకు పట్టణాలకు , కొందరు మేధావులకు మాత్రమే పరిమితమైన ఉద్యమం భారతదేశంలోని నిరక్షరాస్యులయిన అమాయక ప్రజలలోకి సైతం విస్తరించింది.
ఏ మాత్రం ప్రచార మాధ్యమాలుగానీ ,
రవాణా సౌకర్యాలుగానీ లేని ఆ కాలంలో మహాత్ముడు ఉద్యమాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లగలిగాడు.
గాంధీజీ భారత ప్రజల హృదయాన్ని సంస్కృతిని అర్ధం చేసుకున్నవాడు.
ఆయన అతిసాధారణమైన అందరికీ అర్ధమయ్యే ఉద్యమాలు, నినాదాలు ప్రజలలోకి చొచ్చుకుపోగలిగాయి,
వారి హృదయాలను తాకగలిగాయి .
అందుకే ఆయన స్వాతంత్రోద్యమ ప్రణాళికను చక్కగా ఆవిష్కరించగల్గారు.
శ్రీరాముడిని , భగవద్గీత సందేశాలను నమ్మే ఆయన
దుర్మార్గుడయిన జిన్నా దృష్టిలో ఛాందసవాదుడైన హిందువుగా దూషించబడి,
ఒక హిందూ బ్రాహ్మణుడి చేతిలో హత్య చేయబడ్డాడు.
40 కిలోల బరువుకూడా లేని, ఎవరి తోడూ లేకుండా నడవలేని ఆ 79 ఏళ్ళ మహితాత్ముడు కిరాతకంగా చంపబడ్డాడు.
ప్రపంచం దృష్టిలో బుద్ధుడు , జీసస్ ల సరసన నిలబడ్డాడు.
అందుకే ఆయన దేశభక్తుడు కాదు .
విశ్వభక్తుడు.
రక్తపాతం లేని ప్రపంచాన్ని ఆయన కోరుకున్నాడు.
ఆయన హత్య వార్త భారతావని మొత్తం తమ ఇంటి పెద్ద మరణించినట్లుగా భావించి మైల పట్టారు.
బాపూ దహనక్రియలు పూర్తి అయ్యాకే దేశం భోజనం చేసింది.
✍️ అర్వపల్లి విద్యాసాగర్