అస్సాంలోని ఒక గ్రామంలో ప్రతి రోజు రాత్రి కుక్కలు ఎక్కువగా మొరుగుతుంటే వారికి ఈ లాక్ డౌన్ సమయంలో దొంగలేమైనా వస్తున్నారేమో అని సీసీ కెమెరాను పెట్టించారు అప్పుడు దొరికిన చిత్రమే అట ఇది. ఈ సంఘటన అర్దం కాక ఈ ఆవును కొత్తగా కొన్నారు కనుక, వారికి విషయం అర్థం కాక, కొన్న చోటకు వెళ్లి విచారించగా..
ఒక చిరుత పుట్టిన 20 రోజులకే తల్లిని కోల్పోవడంతో, ఆ చిరుతకు గ్రామా ప్రజలు ఈ ఆవు దగ్గర పాలు పట్టించారంట. కాస్త పిల్ల చిరుత పెద్దది అవడంతో తీసుకెళ్లి అడవిలో దింపేశారు.
ఆ చిరుత తనకు పాలు పట్టించిన ఆ ఆవుని తల్లిగా భావించి ఆవును చూడడం కోసం వచ్చేదట.
ఆవును పక్క ఊరికి అమ్మేయడంతో అమ్మ ప్రేమను వెతుక్కుంటూ చిరుత అక్కడికి వచ్చిందట… క్రూర జంతువే పాలు తాగినందుకు ప్రేమను చాటుకుంటుంటే…
కానీ కొంతమంది ఇక్కడనే పుట్టీ, ఇక్కడ తిండి తింటూ, పరాయి దేశం గొప్పది అంటూ, మనదేశాన్ని ద్వేషించే వాళ్లకు ఈ పోస్ట్ అంకితం…
జైహింద్…. ???
భాషా దోషాలు, వాక్యనిర్మాణం పట్టించుకోకండి. ఆవు-చిరుత ‘కత’ బాగుంది కదా? ‘కత’ అని ఎందుకు సంభోధించాల్సి వచ్చిందంటే… నిజంగా ఇది ‘కతే’ కాదు… ‘కట్టు కత’ కూడా. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మొన్నా మధ్య ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఒకరు వలస కార్మికుల నుంచి అమ్యామ్యాలు తీసుకుంటున్నవీడియో గురించి కూడా ts29 వాస్తవాన్ని బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే.
ఇదిగో ఈ తాజా పోస్టుపైనా అటువంటి సందేహమే కలిగింది. ‘ఆవు కత’ గురించి తెలుసుగా? ఎక్కడి నుంచి ‘కత’ ప్రారంభించినా పచ్చగడ్డి, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి తదితర పాలపదార్థాలతోనే ‘కత’ సా….గుతూ ఉంటుంది. ఇది కూడా అటువంటి ‘కతే’. ‘రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా ఫ్యాక్ట్ చెక్ చేయగా ఇది తప్పుడు కథనంగా తేలింది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ‘న్యూస్ మొబైల్’ అనే మీడియా సంస్థ ఓ వార్తా కథనాన్ని కూడా నాలుగు రోజుల క్రితమే ప్రచురించింది. ఇందుకు సంబంధించి 2002అక్టోబర్ 25న టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన వార్తా కథనాన్ని కూడా ‘న్యూస్ మొబైల్’ తన కథనంలో ప్రస్తావించడం గమనార్హం.
అందువల్ల ఇటువంటి ‘ఆవు కత’ల సోషల్ మీడియా పోస్టులను ఉన్నఫళంగా నమ్మేసి షేర్ చేయాల్సిన అవసరం లేదనే విషయాన్ని నెటిజన్లు, ముఖ్యంగా వాట్సాప్ డిగ్రీ హోల్డర్స్ గుర్తించాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. కనిపించే చిత్రాలన్నీ వాస్తవం కాకపోవచ్చు. మీ కళ్లను అవి మోసం చేయవచ్చు. అదీ సంగతి.
లింక్ చదవండి: Fact Check: This picture of a cow and a leopard was NOT taken in Assam during lockdown