గాలికి బస్సు కొట్టుకుపోతుందా? మరీ విచిత్రం కాకపోతే…? అని ప్రశ్నించకండి. ఔను… గాలి ధాటికి ఓ బస్సు రివర్స్ జర్నీ చేసింది. సత్తుపల్లి పట్టణ శివారల్లో ఘటన చోటు చేసుకుంది. అత్యంత వేగంగా వీచిన ఈదురుగాలుల తీవ్రతకు పార్క్ చేసిన ఓ బస్సు దారీ, తెన్నూ లేకుండా వెనక్కి వెళ్లడం విశేషం. ఖమ్మం జిల్లాలో శనివారం సాయంత్రం భారీ ఎత్తున ఈదురుగాలులు వీచాయి. పలు చోట్ల వర్షం కూడా కురిసింది. సత్తుపల్లి పట్టణ శివార్లలోనూ పెద్ద ఎత్తున వీచిన గాలి, దుమారానికి ఓ ప్రయివేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు దాదాపు 200 మీటర్ల వరకు వెనక్కి వెళ్లింది. బస్సును పార్క్ చేసిన డ్రైవర్ దాన్ని కనీసం గేర్లో కూడా ఉంచినట్లు లేదు. అందుకే కాబోలు దాదాపు రెండు టన్నుల బరువు గల బస్సు గాలి ధాటికి వెనక్కి వెళ్లి చెట్టును ఢీకొన్న దృశ్యానికి సంబంధించిన వీడియోను ఇక్కడ చూడండి.