రాష్ట్రంలో కొత్తగా 404 మద్యం దుకాణాలను పెంచుతూ తెలంగాణా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు నూతన మద్యం విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగానే ప్రస్తుతం గల 2,216 మద్యం దుకాణాలకు అదనంగా మరో 404 లిక్కర్ షాపులను మంజూరు చేసింది. దీంతో తెలంగాణాలో వైన్ షాపుల సంఖ్య 2,620కి పెరిగినట్లయింది.
లిక్కర్ షాపుల కేటాయింపుల్లో ఈసారి రిజర్వేషన్ పద్ధతి పాటిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం షాపుల్లో ఎస్సీలకు 262, ఎస్టీలకు 131, గౌడలకు 363 మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. రాష్ట్రంలో కొత్తగా పెంచిన మద్యం దుకాణాలకు ఈనెల 18వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించి, 20వ తేదీన కేటాయింపులు చేస్తారని ప్రభుత్వం వెల్లడించింది.
ఫొటో: ప్రతీకాత్మక చిత్రం