పర్యాటకంగా లక్నవరం చెరువు మరో ముందడుగు వేసింది. తద్వారా కొత్తందాలతో పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ చెరువులో ఏర్పాటు చేసిన ‘జిప్ సైక్లింగ్’ ట్రయల్ రన్ విజయవంతమైంది. దీంతో జిప్ సైక్లింగ్ సరదా పర్యాటకులకు కూడా రెండు, మూడు రోజుల్లోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిప్ సైక్లింగ్ మాత్రమే కాదు, సైక్లింగ్ బోట్ ను కూడా చెరువు వద్ద ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఒక్కరే సైకిల్ తొక్కుతూ దాదాపు 20 నిమిషాలపాటు చెరువులో సంచరిస్తూ ఆహ్లాదాన్ని ఆస్వాదించవచ్చు. ఇందుకు రూ. 200 వరకు ఛార్జి ఉండవచ్చని సమాచారం. జిప్ సైక్లింగ్, సైక్లింగ్ బోట్ లకు సంబంధించిన ట్రయల్ రన్ దృశ్యాలను దిగువన చూడవచ్చు.