దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల స్థాపించబోయే రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. ఈ విషయాన్ని ఆ పార్టీ కో ఆర్డినేటర్ వాడుక రాజగోపాల్ ప్రకటించారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో షర్మిల ముఖ్య అనుచరుడు వాడుక రాజగోపాల్ రాజకీయ పార్టీని రిజిస్టర్ చేసిన సంగతి తెలిసిందే. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుపై ఏవేని అభ్యంతరాలు ఉంటే తెలపాలని ఓ జాతీయ పత్రిక లో ప్రకటన కూడా జారీ అయింది. వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఏర్పాటుకు సంబంధించి అన్ని పత్రాలను కేంద్ర ఎన్నికల కమిషన్ కు రాజగోపాల్ సమర్పించారు.

ప్రక్రియలో భాగంగా పార్టీ రిజిస్ట్రేషన్ పూర్తయినట్లు రాజగోపాల్ సోమవారం వెల్లడించారు. పార్టీ ఏర్పాటుపై ఎటువంటి అభ్యంతరాలు లేవని ఎన్నికల సంఘానికి విజయమ్మ లేఖ రాసినట్లు చెప్పారు. ఎన్నికల సంఘం నుంచి అధికారికంగా సమాచారం అందిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని, వైఎస్సార్ జయంతి రోజైన జూలై 8వ తేదీన పార్టీ ఏర్పాటును ప్రకటించాలని షర్మిల భావిస్తున్నట్లు రాజగోపాల్ పేర్కొన్నారు.

ఫొటో: వైఎస్ షర్మిలతో రాజగోపాల్

Comments are closed.

Exit mobile version