ఔను… ఫంగస్ రకరకాల రంగుల్లో వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగించే పరిణామం. బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్. ఇవిగాక బ్లాక్ అండ్ వైట్ ఫంగస్… అంటే ఒకే వ్యక్తిలో నలుపు, తెలుపు ఫంగస్ లక్షణాలు. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో ఈ ఘటన నిన్న వెలుగులోకి వచ్చింది. ఒకే రోగిలో బ్లాక్, వైట్ ఫంగస్ లక్షణాలు కనిపించినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఓ వైపు బ్లాక్ ఫంగస్, మరోవైపు వైట్ ఫంగస్, ఇంకోవైపు బ్లాక్ అండ్ వైట్ పంగస్… ఆయా రంగుల్లో వెలుగు చూస్తున్న ఫంగస్ కారణంగా కరోనా బాధిత రోగులు అల్లాడుతుంగా, మరో కొత్త రంగులో ఇంకో ఫంగస్ ఘటన వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ కు చెందిన ఓ పేషెంట్ కు యెల్లో ఫంగస్ నిర్ధారణ జరిగినట్లు అధికారులు సోమవారం వెల్లడించారు. బ్లాక్, వైట్ ఫంగస్ కన్నా యెల్లో ఫంగస్ ప్రమాదకరంగా వార్తలు వస్తున్నాయి. నిల్వ ఉన్న ఆహార పదార్థాలు యెల్లో ఫంగస్ పెరుగుదలకు కారణంగా అంచనా వేస్తున్నారు.