ఢిల్లీ నుంచి లండన్ కు బస్సు సర్వీసు గురించి కొద్దిసేపటి క్రితం ప్రచురించిన పోస్టులో చెప్పుకున్నాం కదా? ఈ అంశంపై జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్థలు భారీ ఎత్తున వార్తా కథనాలు ప్రచురిస్తున్నాయి కూడా. కానీ వాస్తవానికి ‘లండన్ బస్’ సర్వీసు కొత్తదేమీ కాకపోవడమే అసలు విశేషం. దాదాపు అరవై సంవత్సరాల క్రితమే ఇటువంటి అంతర్జాతీయ బస్సు సర్వీసు ఒకటి ఉండేదంటే ఆశ్చర్యం కాదు మరి.
‘ఆల్బర్ట్ టూర్స్’ పేరుతో 1960లో లండన్ నుంచి ప్రస్తుత కోల్ కతా (అప్పటి కలకత్తా) మార్గంలో ఓ బస్సు ఉండేది. దీన్ని అల్బర్ట్ డబుల్ డెక్కర్ బస్సుగా వ్యవహరించేవారు. ప్రపంచంలోనే పొడవైన మార్గంలో ఈ బస్సు ప్రయాణించేది. కలకత్తా-లండన్ మార్గం మధ్య ఒకవైపు ప్రయాణానికే అప్పట్లో 135 పౌండ్లు (మన కరెన్సీలో దాదాపు 13, 518 రూపాయలను ఛార్జిగా వసూలు చేసేవారు. ఇక్కడ మీరు చూస్తున్నది అప్పటి కలకత్తా-లండన్ బస్సు సర్వీసుకు సంబంధించిన అరుదైన దృశ్యాలే.