అగో ఆడోళ్లందరూ ఒకడిని చితకబాదుతున్నారు అనే గదా మీరు ఆలోచించేది..? ఔను.. వాడు ఓ మహిళకు మాయ మాటలు చెప్పి మూడు నెలలుగా అత్యాచారం చేశాడు. ఇంట్లో కుటుంబీకులకు చెబితే అందరినీ హత్య చేస్తానని బెదిరించాడట భూత వైద్యుడు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగిన ఈ సంఘటన సంచలనం రేపుతోంది.
ఓ పదిహేనేళ్ల బాలికకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి మూడు నెలలుగా అత్యాచారం చేశాడట భూత వైద్యుడు. కడుపు నొప్పితో డాక్టర్ దగ్గరికి పోతే ఈ దారుణం బయట పడ్డది. మహిళా సంఘాలతో కలిసి వెళ్లిన తల్లిదండ్రులు… ఆ భూతవైద్యుడి కామపిశాచిని కట్టెలతో మక్కెలిరగ కొట్టారు. శుభ పరిణామం.
నిజమే.. ఈ చితకబాదుడు దృశ్యం చూస్తుంటే జర్నలిస్టులకు మసాలా దొరికిందని మురిసి పోతున్నారు కదూ..! బ్రేకింగ్ న్యూస్ అంటూ రోజంతా అవే విజువల్స్. ‘‘భూత వైద్యుడికి మహిళల దేహశుద్ది’’ అంటూ రొటిన్ వార్తనే కదా..? నిజానికి ఈ దృశ్యం చూసి సిగ్గు పడాల్సింది జర్నలిస్టులే..! ఈ కలికాలంలో వేశ్యలా మారిన జర్నలిజాన్ని రక్షించకపోతే ఇంతకంటే ఇంకెక్కువ ఘోరాలు జరిగే ప్రమాదం ఉంది. ఆ భూతవైద్యుడు మహిళను రేప్ చేస్తే జర్నలిస్టులు ఎందుకు సిగ్గు పడాలానేది గదా మీ అనుమానం..?
జర్నలిజాన్ని అడ్డు పెట్టుకుని వివిధ రకాల మోసాలు చేస్తున్న పెద్ద పెద్ద జర్నలిస్టుల్లాగా ఆయా భూతవైద్యుడు నిజామాబాద్ కేంద్రంగా వెలువడుతున్న ఓ పత్రికకు అధిపతి. అంటే చీఫ్ ఎడిటర్ కమ్ సీఇవో.. అన్నమాట. నమ్మడం లేదా..? అయితే నిజామాబాద్ జిల్లాకు చెందిన మన జర్నలిస్ట్ మిత్రులను అడిగితే కన్ ఫాం చేస్తారు. భూత వైద్యుడైనా, జర్నలిస్టయినా, ఇంకెవారైనా మహిళలకు అన్యాయం చేస్తే శిక్షించాల్సిందే.
మరి టీవీ ఛానల్స్ లో కావచ్చు.., దిన పత్రికలు ఇప్పుడు చేస్తున్న పనేమిటి..??? జర్నలిజంలోని నైతిక విలువలెక్కడా..? జర్నలిజం అంటే అవహగాహన లేని గూండాలు.., రౌడీలు.., పదవ తరగతి కూడా ఉత్తీర్ణులు కాని వ్యక్తులను డబ్బులు తీసుకుని ‘‘రిపోర్టర్’’ గా పెట్టుకునే సీనియర్ జర్నలిస్టులు సిగ్గుపడాలి. యాడ్స్ ఇస్తే చాలు అంటూ ప్రొత్సహించే సీఇవోలు.., చీఫ్ ఎడిటర్లు తల దించుకోవాలి. జర్నలిజాన్నిఅంగట్లో (వేశ్యలా) సరుకులా అమ్ముతుంటే కళ్లుండి చూడలేని జర్నలిస్ట్ లీడర్లమని పోజులు కొట్టే వారు సిగ్గుపడాలి.
డబ్బున్నోడు టీవీ న్యూస్ ఛానల్ పెడుతాడు. దిన పత్రికలు పెడతాడు. నచ్చిన రాజకీయ పార్టీలకు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్న సీఇవోలు, చీఫ్ ఎడిటర్లు జర్నలిజాన్ని వేశ్యగా మార్చేశారు గదా..! ఇప్పటికైనా ఈ జర్నలిజంలో నైతిక విలువలు కాపాడాల్సిన అవసరం ఎంతైన ఉంది. ఈ కామపిశాచి పత్రిక పేరుతో భూతవైద్యం చేస్తూ మహిళలపై అత్యాచారం చేస్తే, హైదరాబాద్ కేంద్రంగా కొందరూ సీఇవోలు, చీఫ్ ఎడిటర్లు కూడా వేశ్యలాగా మారి పోయి పక్షపాతంతో వార్తా కథనాలు ఇస్తూ ప్రజాస్వామ్యాన్ని… సారీ.. జర్నలిజాన్ని అదే పని చేస్తున్నారు గదా..?
జర్నలిజాన్ని రక్షించకపోతే భవిష్యత్తులో నిజామాబాద్ లాంటి ప్రమాదకరమైన సంఘటనలు స్టేట్ అంతటా చూడాల్సిందే. ఇప్పటికైనా జర్నలిజాన్ని రక్షించుకుందాం.
✍️ యాటకర్ల మల్లేష్, సీనియర్ జర్నలిస్ట్
(నిజామాబాద్ లో జర్నలిస్ట్ ముసుగులో ఉన్న భూతవైద్యుడు ఓ మహిళపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ మహిళలు దేహశుద్ది చేసిన సంఘటన చూసి..)