తాము ఓట్లు వేసి ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు సమస్యలు తీర్చడంలో వైఫల్యం చెందినపుడు ప్రజలు ఎలా స్పందిస్తారు? నిరసన వ్యక్తం చేస్తారు. ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తారు. మరింత ఆగ్రహం కలిగితే రాజకీయ నాయకుల దిష్టిబొమ్మలు దహనం చేస్తారు. ఇంకా కోపం కలిగితే కాస్త కఠిన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఈ సందర్భంగా చేపట్టే ఆందోళనలు రకరకాల పరిణామాలకు దారి తీయడం పలు సందర్భాల్లో చూస్తుంటాం.
కానీ తాగునీటి కష్టాలు తీర్చని అధికార పార్టీ నేతల తీరుపై కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన మహిళలు వినూత్న రీతిలో మండిపడుతున్నారు. మున్సిపల్ పాలకవర్గ నేతలపైనేకాదు, స్థానిక ఎమ్మెల్యే క్యాంపు ఆపీసు వద్ద కూడా ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధుల వ్యవహార తీరుపై ఆగ్రహించిన మహిళల్లో ఓ వృద్ధురాలితోపాటు మల్లవ్వ అనే మహిళ వారిని వెక్కిరిస్తూ ఎలా ‘యాక్షన్’ చేశారో దిగువన గల వీడియోలో తిలకించండి.