రోడ్లు చెర్లయ్యాయి.. ఊర్లు నదులయ్యాయి
ఎందుకీ శాపం.. ఎవరిది ఈ పాపం?
రెండు రోజులు వర్షానికే తట్టుకోలేకపోతున్నం
చెరువు నీళ్లేమీ మన దగ్గరకు రాలేదు
మనమే చెరువు దగ్గరకు పోయినం
నాలా నీళ్లు మన ఇంట్లోకి రాలేదు
మనమే నాలా స్థలంలో ఇల్లు కట్టుకున్నం
ఏడాదిలో రెండు రోజులు వర్షం పడితే చాలు
మా కాలనీ మునిగి పోయిందని బాధపడుతున్నం
మా ఇంట్లోకి నీళ్లొచ్చాయని మొత్తుకుంటున్నం
ఇలా అన్నందుకు ఎవరూ బాధ పడకండి
ఇంతకీ ఈ జల ప్రళయానికి ఎవరిది బాధ్యత?
నాలలు కబ్జా చేసినప్పుడు ఎక్కడున్నారు అంతా?
చెరువులు కబ్జా చేసి లే ఔట్లు చేసినప్పుడు ఏరీ?
సౌకర్యాలు లేవని కనీసం అడ్డుకోవాలి కదా?
ఇన్నాళ్లూ ఎవరూ ఎందుకు పట్టించుకోలేదు..
గజం 50 వేలు అన్నా చూడకుండా ఎగబడి కొన్నారు కదా
ప్రభుత్వ సూచనలు ఎవరైనా పాటించారా.. చెప్పండి
లేఔట్ లేని ప్లాట్లు కొనవద్దని ప్రభుత్వం చెప్పినా విన్నారా?
అందుకే కదా ప్రభుత్వం ఎల్.ఆర్.ఎస్ తీసుకొచ్చింది
మీ ప్లాట్లు క్రమబద్దీకరించుకోమని చెబితే ఎందుకంత కోపం?
అపుడు అధికారులు వస్తారు.. ఏం ఉందీ, ఏం లేనిదీ చూస్తారు
ఉండాల్సినవి ఉండేలా చూసి, ఎల్.ఆర్.ఎస్. చేస్తారు కదా
చేసిన తప్పును సరిదిద్దుకోమని చెప్పినా కూడా తప్పేనా?
2 రోజులకే గిట్లయితే, మరి 10 రోజులు వాన పడితే పరిస్థితేంటి?
ప్రభుత్వాన్ని నిందిస్తారా? ప్రభుత్వం అంటే ప్రజలే కదా?
ప్రభుత్వం మాత్రం మనల్ని ఎంతకని నడుపుతుంది?
భారీ విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది?
ప్రభుత్వంలో వందలమంది ఉంటారు.. ప్రజలు కోట్లల్లో ఉంటారు
ప్రభుత్వం మాత్రం చేసే పని చేస్తుంది.. మనం బాధ్యతగా ఉండొద్దా?
![ts29 pydi compressed](https://i0.wp.com/ts29.in/wp-content/uploads/2020/10/pydi-compressed.jpg?resize=788%2C956&ssl=1)
ఏ ఎన్నికలు వచ్చినా సరే.. మా ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయి…
10 వేలు ఇస్తారా అని అడిగినప్పుడు ఇవన్నీ గుర్తుకురాలేదా?
బస్తీలో వెడల్పుగా ఉన్న నాలాలు కబ్జా చేసి బిల్డింగులు కట్టారు
నాలా కబ్జా చేసి, ఇప్పుడు మా ఇంట్లోకి నీరు వస్తుందంటే ఎలా?
నాలాలు, చెరువులు కబ్జా చేసినప్పుడు ఎందుకు పట్టించుకోలేదు
అప్పుడు మనకు పార్టీలు, కులాలు, మతాలు అడ్డం వచ్చాయా?
పవర్ పోయింది పట్టించుకోవడం లేదని.. చెట్లు పడిపోయాయని,
విద్యుత్ వైర్లు తెగిపోయాయి… అని వాట్సపుల నిండా మెసేజులు,
బాగు చేయాలంటే ఎంతమంది సిబ్బంది కావాలి.
అంతటా ఇదే సమస్య
ఈ సమస్యకు పరిష్కారం.. నాలాలపై ఇండ్లు కూల్చివేయాలి
చెరువులలో ఫుల్ టాంక్ లెవల్ (FTL) వెంటనే పునరుద్ధరించాలి
ఇండ్లు కోల్పోయిన వాళ్లకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి
దాంతో నాలాలు బాగు పడతాయి.. నీళ్లన్నీ సాఫుగా వెళ్లిపోతాయి
జనం ఇబ్బందులు లేకుండా బతుకుతరు.. ఇదే పరిష్కారం..
✍️ డాక్టర్ గోపాల ఇతిహాస్, వరంగల్