పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ సర్కార్ మళ్లీ కొలువుదీరనుంది. ఆ రాష్ట్ర ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ హ్యాట్రిక్ విజయాన్ని సాధించింది. ఈ వార్త రాసే సమయానికి టీఎంసీ పార్టీ 163 స్థానాల్లో విజయం సాధించింది. మొత్తం 292 అసెంబ్లీ స్థానాలు గల బెంగాల్ అసెంబ్లీలో ఇప్పటికే 163 స్థానాల్లో విజయం సాధించి మేజిక్ ఫిగర్ ను టీఎంసీ పార్టీ దాటేసింది. మరో 54 స్థానాల్లో అధికర్యంలో ఉంది. అదేవిధంగా బీజేపీ ఇప్పటి వరకు 47 స్థానాల్లో విజయం సాధించగా, మరో 26 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
అదేవిధంగా తమిళనాడులో డీఎంకే పార్టీ అధికారానికి చేరువగా ఫలితాలు సాధిస్తోంది. ఇప్పటి వరకు అందిన ఫలితాల ప్రకారం మొత్తం 234 స్థానాల్లో 44 స్థానాల్లో డీఎంకే అభ్యర్థుల గెలుపొందగా, 112 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఏడీఎంకే పార్టీ 14 స్థానాల్లో విజయం సాధించగా, 64 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
కేరళలో 140 స్థానాల్లో ఎల్డీఎఫ్ 86 స్థానాల్లో గెలుపొందగా, 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. యూడీఎఫ్ 36 స్థానాల్లో గెలుపొందగా, అయిదింట ఆధిక్యంలో ఉన్నారు. కాగా ఇక్కడ బీజేపీ ఏ ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేకపోగా, గతంలో ఉన్న ఒక్క సీటు ప్రాతినిధ్యాన్ని కూడా కోల్పోయింది. ఇక్కడ అధికార పార్టీ రెండోసారి విజయం సాధించడం గడచిన నాలుగు దశాబ్ధాల్లో ఇదే తొలిసారి కావడం విశేషం. కాగా అసోంలో బీజేపీ కూటమి మరోసారి విజయం దిశగా ఫలితాలు సాధిస్తోంది.