వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటువంటి వారికే స్వాగతం చెప్పాలి. కరోనాను జయించినవారి గురించి పది మందికీ తెలియాల్సిన అవసరముంది. అందుకే కాబోలు మిత్రుడు పి. లక్ష్మారెడ్డి సోషల్ మీడియాలో ఏమంటున్నారంటే…
‘‘ఫ్లెక్సీ కట్టడం కామన్. తమ పార్టీ నేత బర్త్ డే రోజున బ్యానర్లు ఏర్పాటు చేయడం చూశాం. పండగలు, పెళ్లిళ్లులకు కూడా ఇలాంటి బ్యానర్లు, ఫ్లెక్సీలు కనిపిస్తాయి. కానీ ఇది కరోనా కాలం కదా..! ట్రెండ్ మారింది. కరోనా బారినపడి కోలుకున్న వారికి కూడా ఫ్లెక్సీలు కడుతున్నారు. ‘కరోనాను వణికించి.. విజయం సాధించి ఇంటికి వస్తున్న అన్నయ్యకు స్వాగతం.. సుస్వాగతం..” అంటూ.. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఫ్లెక్సీలు వెలిశాయి.’’