కరోనా మహమ్మారి మనిషి జీవన విధానాన్నే కాదు, పెళ్లిళ్లు, పేరంటాల తీరు తెన్నులను సైతం మార్చేసింది. కృష్ణా జిల్లాలో జరిగిన ఓ పెళ్లి భోజనానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే ఈ వార్తాంశపు విశేషం.
కరోనా కల్లోల పరిణామాల్లో పెళ్లి తంతు సాదా, సీదాగా జరిగితే అందులో వింతేముంటుంది. అందుకే కాబోలు పెళ్ళికి వచ్చిన వారికి భోజనాలు వడ్డించే దగ్గరే ఓ విచిత్ర సన్నివేశం సాక్షాత్కరించింది. పెళ్ళికి వచ్చిన అతిథులకు భోజనం వడ్డించే క్యాటరింగ్ బాయ్స్ పీపీఈ కిట్లు ధరించి కనిపించడంతో పెళ్లికొచ్చిన వారంతా కంగారుపడ్డారు.
తొలుత కరోనా పేషెంట్ల కోసం వచ్చారని కాస్త ఆందోళన చెందినా, ఆ తర్వాత విషయం తెలుసుకుని ముక్కున వేలేసుకున్నారు. మీ జాగ్రత్తకు కరోనా పారిపోనూ… అంటూ ముసిముసిగా నవ్వుకున్నారు. ఇంతకీ పెళ్లి భోజనాల్లో ఈ కేటరింగ్ ‘వెరయిటీ’ ఎక్కడిదో చెప్పలేదు కదూ! ‘కోటి సప్లయర్స్’ పేరుతో గుడివాడలో గల కేటరింగ్ సంస్థది. ఇక ఆ వింతకు సంబంధించిన వీడియోను దిగువన చూడండి.