తాటి, ఈత చెట్ల నుంచి కల్లు పారుతుంది. వేపచెట్లు కూడా వేప కల్లును ఇస్తుంటాయి. అటవీ ప్రాంతాల్లోని పాల చెట్టుకు పాలు కారడమే కాదు, పాల పండ్లు కూడా కాస్తాయి. పలు జాతుల చెట్లు కొమ్మలు విరిచినా, రెమ్మలు తెంచినా పాలు కారుతుంటాయి. ఒక్కో చెట్టు ఒక్కో స్వభావాన్ని కలిగి ఉంటుంది.
కానీ ఇందుకు విరుద్ధంగా గొడ్డలి వేటుకు ఈ చెట్టు నీళ్లు కారుస్తోంది. కన్నీళ్లు మాత్రం కాదు సుమీ… మంచి నీళ్లే. టెర్మినాలిస్ టొమెంటోసాగా వ్యవహరించే ఈ వృక్షాలను అశాన్, అశ్నా, సజ్ అని కూడా పిలుస్తుంటారట. ఈ చెట్లు తమ కాండాల్లో నీటిని నిల్వ ఉంచుకుంటాయని అటవీ అధికారులు చెబుతున్నారు. తమిళనాడులో గల ఈ చెట్లు నీళ్లు కారుస్తున్న వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి దిగ్విజయ్ సింగ్ ఖాటీ తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.