గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల మేయర్ అభ్యర్థులు ఖరారయ్యారు. సీల్డ్ కవర్లలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసింది. ఖమ్మం కార్పొరేషన్ తొలి మహిళా మేయర్ అభ్యర్థిగా పునుకొల్లు నీరజ అభ్యర్థిత్వాన్ని టీఆర్ఎస్ పార్టీ ఖరారు చేసింది. అదేవిధంగా డిప్యూటీ మేయర్ గా ఫాతిమా ముక్తార్ అభ్యర్థిత్వాన్ని నిర్ణయించారు. వీరిద్దరి ఎన్నికల లాంఛనమే. మరికొద్దిసేపట్లోనే వీరిద్దరి ఎన్నిక జరగనుంది. ఖమ్మం కార్పొరేషన్ లో 60 డివిజన్లు ఉండగా, 43 డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందిన సంగతి తెలిసిందే.
అదేవిధంగా గ్రేటర్ వరంగల్ మేయర్ అభ్యర్థిగా గుండు సుధారాణిని, డిప్యూటీ మేయర్ గా రిజ్వానానను అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంపిక చేసింది. ఇక్కడ కూడా వీరిద్దరి ఎన్నిక లాంఛనమే. మరికొద్దిసేపట్లోనే ఆయా నగరాల మేయర్ల, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరగనుంది.