ఖమ్మం జిల్లా అధికార పార్టీ రాజకీయాల్లో ఇదో పెను దుమారం. ప్రస్తుత మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గీయుల మధ్య సోషల్ మీడియా వేదికగా యుద్ధం జరుగుతోంది. జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ ఆఫీసులో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫొటో తొలగించారనే అంశం ప్రామాణికంగా ఈ యుద్ధం జరుగుతుండడం గమనార్హం. తుమ్మల వర్గీయుల పోస్టులను మంత్రి అజయ్ వర్గీయులు గట్టిగానే కౌంటర్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సోషల్ మీడియా పోస్టులను దిగువన చదివేయండి.
తుమ్మల భజన సంఘం ఖబర్దార్. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై దుష్ప్రచారం చేస్తే కార్యకర్తల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుంది.
పార్టీ కార్యాలయంలో ఫోటో తీసివేస్తే మంత్రి అజయ్ కుమార్ గారికి ఎమ్ సంబంధం.ఎంత సేపు మంత్రి గారి మీద ఎలా బురద చల్లాలనే ఆలోచనలతో కొంత మంది తుమ్మల భజన సంఘం చేసే దుష్ప్రచారాన్ని నమ్మే పరిస్థితులలో ఈ రోజు ఖమ్మం జిల్ల్లా తెరాస కార్యకర్తలు లేరనే విషయం గుర్తుంచుకోండి.
పార్టీ కార్యాలయ వ్యవహారాలలో ఎప్పుడైనా మంత్రి జోక్యం చేసుకున్నారా ఆధారాలు చూపకుండా నిందలు వేస్తె తగిన మూల్యంచెల్లించుకోవాల్సి వస్తుంది.
ముఖ్య మంత్రి వర్యులు కెసిఆర్ గారు నమ్మి కనీసం ఎమ్ ఎల్ ఏ కూడా కాకుండా మంత్రి వర్గంలో తీసుకుంటే 2019 ఎన్నికలలో వేలకోట్లు పెట్టి అభివృద్ధి చేసినాను అని చెప్పుకునే నాయకుడు మంత్రి గా ఉండి ఒక సామాన్యుడి చేతిలో ఘోర పరాభవం ఎందుకు పొందినారు?.
తనతో పాటు జిల్లా లో 9స్థానాలు ఓడిపోవటంలో మీ పాత్ర లేదా ? జిల్లా అంతా ఓటమి పాలైన తనకున్న ప్రజాభిమానం. వారి ఆదరణతో గెలిచిన ఒకే ఒక్కడు అజయ్ అన్న అందుకే ముఖ్య మంత్రి వర్యులు ఆదరించి మంత్రి గా అవకాశం ఇస్తే వారు చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక మీరు చేస్తున్నవి దిగజారుడు ప్రచారాలు కాదా ? మీరా అజయ్ అన్నను విమర్శించేది.
గ్రూపులను ప్రోత్సహించింది ఎవరు? 30 సంవత్సరాలు జిల్లాలో ఇంకో నేతను ఎదగనివ్వకుండా చేసి ఏ పార్టీ లో ఉంటె ఆ పార్టీ అభ్యర్థుల కు వ్యతిరేకంగా తన మనుషులను పెట్టి వారిని ఓడించి జిల్లాలో ఏక చక్రాధిపత్యం నడపాలని చూసింది ఎవరో కొంచెం రాజకీయ అవగాహనా ఉన్న ఏ వ్యక్తి ని అడిగిన చటుక్కున చెప్పే పేరు తుమ్మల. మీరా గ్రూపుల గురించి మాట్లాడేది ?
భక్తరామదాసు ప్రాజెక్ట్ తో పాలేరు నియోజకవర్గ రైతుల కలను సాకారం చేసిన తుమ్మల అని చెప్పుకునే ఓ భజన సంఘం ఆ రైతులే అక్కడ ఆయనని ఓ అనామకుడి చేతిలో ఓడించారన్న విషయం మర్చి పోయారా ?
కాలువలు రోడ్లు వేస్తె జనం ఓటు వెయ్యరనే విషయం పాలేరు ప్రజలు చెప్పకనే చెప్పినారు. ఐన మీకు ఇంకా బుధ్ధి రాలేదా? ప్రజలు అభిమానించాలంటే రోడ్లు వెయ్యటం బిల్డింగ్ లు కట్టటం కాదు. ఏనాడైనా ఏ కార్య కర్త తో మీరు అభిమానంగా మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా ? కార్యకర్తలే కాదు మండల నాయకత్వానికి మీ పలకరింపు బంగారం అయ్యేది. ఇది నిజం కాదా ?
ముఖ్య మంత్రి కెసిఆర్ యువనేత కేటీర్ ఆసిస్సులతో ఉమ్మడి జిల్లాలోని ఎమ్ ఎల్ ఏ లు అందరిని కలుపుకొని పోయి ఎవ్వరి నియోజక వర్గాలలో తలదూర్చకుండా, వర్గాలు చేయకుండా అందరిని కలుపుకొని అభివృద్ధి చేస్తున్న అజయ్ కుమార్ గారి పై ఇటువంటి చౌక బారు విమర్శలు చేస్తే సహించేది లేదు.
మీరు జిల్లా కు చేసిన సేవలు చాలు అనే ప్రజలు మిమ్మల్ని తిరస్కరించిన కృష్ణ రామ అని ఇంట్లో కూర్చోకుండా మంత్రిఅజయ్ కుమార్ పై బురద చల్లే రాజకీయాలు చేస్తూ చిల్లర విషయాలలో అప్రతిష్ట పాలు చేయాలనీ చూస్తే తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుంది జాగ్రత్త.
ఇప్పటికైనా మీ చౌక బారు రాజకీయాలు మాని హుందాగా ఉండాలని, మీ భజన సంఘం చేసే దుష్ప్రచారాలు మానుకొక పొతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది జాగ్రత్త.
జై అజయ్ అన్నా జై జై కెసిఆర్*
ఇట్లు :- అజయ్ అన్నా అభిమాన సంఘం. ఉమ్మడి ఖమ్మం జిల్లా✊✊
ఖమ్మం జిల్లా TRS పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఫోటో తొలగించారని తప్పుడు వార్తలు సోషల్ మీడియా వేదికగా ప్రచారం అవుతున్న నేపధ్యంలో…
RJC కృష్ణ గారు పార్టీ కార్యాలయం ఇంచార్జి గా నియమితులైన తరువాత తెలంగాణ భవన్ నందు వాస్తు రీత్యా చిన్న,చిన్న మార్పులు చేయడం జరుగుతుంది.దానిలో భాగంగా పార్టీకి,అనుబంధ సంఘాలకి వీలుగా ఉండటం కోసం ప్రత్యేకంగా తెలంగాణ భవన్ పెద్ద అక్షరాలతో ఏర్పాటు, రూములు నిర్మాణం చేయడం,పార్కింగ్ నిర్మాణం, ప్రో. జయశంకర్ సార్ విగ్రహం నిర్మాణం, జరుగుతుంది.అదేవిధంగా జిల్లా కార్యాలయానికి 5/6 అడుగుల అత్యంత ఖరీదైన, ఆర్ట్ చిత్రాన్ని బహుకరించారు. దీనిని ఎంట్రన్స్ లో అలకరించే క్రమంలో హాల్లో ఉన్నటువంటి KCR, తుమ్మల నాగేశ్వరరావు, పువ్వాడ అజయ్ కుమార్ గార్ల ఫోటోలు తీసి భద్రపరచడం జరిగింది…
కేవలం తుమ్మల గారి ఫోటో ఒక్కటి మాత్రమే తీసి,తుమ్మల గారిని అవమాన పరిచారని తప్పుడు ప్రచారం చేయకండి. మాజీ మంత్రి వర్యులు తుమ్మల గారి రూమ్ లో ఉన్నటువంటి మూడు ఫోటోలు యధావిధిగానే ఉన్నాయి.వాటిని ఎవరు తీయలేదు.అది గమనించని కొందరు కుహనా మేధావులు సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
KCR గారి 3D ఆర్ట్ ప్రింట్ ఫొటోలో తుమ్మల గారి ఫోటో లేదు అని మరొక ప్రచారం…
పువ్వాడ అజయ్ కుమార్ గారు KCR గారికి కొడుకు లాంటి వారు…కాబట్టి KCR గారి ఫోటో కింద చిన్న చిన్న ఫోటోలు పెట్టారు…ఆ ఫోటో RJC కృష్ణ గారి మిత్రుడు బహుమతిగా ఇవ్వడంతో గుర్తు కోసం మరొక చిన్న ఫోటో కింద పెట్టుకున్నారు. తుమ్మల గారు KCR గారికి కుడి భుజం లాంటి వారి ఫోటో,KCR గారి కింద వేస్తె బాగుండదు.కనుక అక్కడ ఫోటో వేయలేదు…దయచేసి గమనించండి.
ఏ మాత్రం కూడా రాజకీయాలు తెలియని కొంత మంది సోషల్ మీడియా మేధావులు పార్టీ ఆఫీస్ లో తుమ్మల గారి ఫోటో తీసేశారని ,తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.పార్టీ నిర్మాణం కోసం కష్టపడి పని చేద్దాం. అప్పుడే అందరం మంచిగా సమాజంలో గులాబీ సైనికులంగా గుర్తింపబడుతాం. దయచేసి తప్పుడు ప్రచారాలు మానండి.
జై తెలంగాణ……జై KCR
తెలంగాణ గులాబీ సైనికుడు..ఖమ్మం