వానర చర్యను మనం కోతి చేష్టగా అభివర్ణిస్తుంటాం. కానీ ఈ కోతిని చూడండి. కరోనా ప్రభావం కాబోలు… మనుషులను చూసి తానూ మారినట్టుంది. మనుషులు ముఖానికి మాస్కులు తగిలించుకుని వెడుతున్న సీన్లు రోడ్లపై చూసిందో ఏమో తెలియదుగాని, తానూ ముఖానికి ముసుగేసుకుని ఎలా చక్కర్లు కొడుతోందో చూడండి. అటవీ శాఖ అధికారి సుశాంత నందా ట్వీట్ చేసిన ఈ వీడియో వైరల్ గా మారడం విశేషం. దిగువన మీరూ చూసేయండి.