ఏదేని ఘోర ఘటనలు జరిగినపుడు ఇండియాలో ఎటువంటి శిక్షలు ఉంటాయి? విదేశాల్లో ఇవే నేరాలకు ఏ తరహా శిక్షలు అమలు చేస్తారు? వంటి అంశాలు చర్చకు రావడం సహజం. డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్యాచారం ఉదంతం నేపథ్యంలో నిందితుల నేరం రుజువైతే వారికి న్యాయ స్థానాల్లో పడే శిక్షల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మన దేశంలో నిర్భయ చట్టం అమల్లోకి వచ్చాక రేపిస్టుల విషయంలో శిక్ష కఠినంగానే ఉంది. మహిళలపై లైంగిక దాడులను ప్రభుత్వాలు కూడా తీవ్రంగానే పరిగణిస్తున్నాయి. అత్యాచారాలకు పాల్పడిన నిందితుల నేరం రుజువైన క్రమంలో 14 ఏళ్ల వరకు శిక్ష విధిస్తుండగా, నేర తీవ్రతను బట్టి మరణశిక్షను కూడా కోర్టులు విధిస్తున్నాయి. మన దేశ చట్టాల ప్రకారం కింది కోర్టులో శిక్ష పడిన దోషి ఆపై కోర్టులో అప్పీల్ చేసుకునే హక్కు కూడా ఉంటుంది. పైకోర్టులో తీర్పు ఎలాగైనా ఉండవచ్చు…అంటే అదే శిక్షను ఖరారు చేయవచ్చు, లేదంటే శిక్షను తగ్గించవచ్చు. ఉన్నత న్యాయస్థానం కూడా మరణశిక్షను ఖరారు చేస్తే, ఒక్కోసారి రాష్ట్రపతి క్షమాభిక్ష కూడా లభించవచ్చు.

కానీ విదేశీ చట్టాలకు మన దగ్గర ఉన్నంత ఓపిక ఉండదు. అక్కడి చట్టాలు అలా ఉన్నాయి మరి. కొన్ని దేశాల్లో సత్వర న్యాయం, శిక్ష కూడా అమలవుతోంది. ఆఫ్ఘనిస్థాన్ దేశంలో మహిళవైపు చూడాలంటేనే అక్కడి పురుషుల్లో వణుకు ప్రారంభమవుతుంది. అక్కడ అత్యాచారం చేసిన నిందితులను నాలుగో రోజే రోడ్డుపైకి ఈడ్చుకువెళ్లి ఉరి వేసి చంపుతారు. కొన్ని ఘటనల్లో తలకు తుపాకీ పెట్టి కాల్చి చంపేస్తారు. ఇక చైనాలో అయితే అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి నేరం రుజువైందే తడవుగా వెంటనే అతని పురుషత్వాన్ని ఎందుకూ పనికి రాకుండా చేస్తారు. మరీ కత్తితో కోసి పడేయరుగాని, సర్జరీ ద్వారా అసలు మగతనమే లేకుండా చేస్తారు. హత్యాచారానికి పాల్పడినా, పాశవికంగా రేప్ చేసినా మరణ శిక్షకూడా విధిస్తారు. ఇరాన్ దేశంలో నేరం రుజువు కాగానే ఉరి శిక్ష విధిస్తారు, లేదంటే తుపాకులతో బహిరంగ ప్రదేశాల్లో కాల్చి చంపేస్తారు. ఉత్తర కొరియాలో రేపిస్టులకు నరకమే. తుపాకీ తలకు పెట్టి కాల్చడమే కాదు, ఒళ్లంతా బుల్లెట్టు నింపి మరీ చంపేస్తారు. ఇక సౌదీ అరేబియాలోనైతే అత్యాచారం చేసిన వ్యక్తులను బాధితుల ముందే తల నరికి చంపేస్తారు. కొన్ని సందర్భాలలో బహిరంగంగా ఉరి కూడా తీస్తారు.

ఇంతకీ అప్పట్లో తెలంగాణాలో ఏం జరిగిందనేగా మీ ప్రశ్న? మన చట్టాల ప్రకారం ఈ ఘటన సమర్ధనీయం కాకపోయినా, అప్పట్లో తీవ్ర సంచలనానికి కారణమైంది. వరంగల్ నగరంలోని ఒక పార్టీకి చెందిన స్థానిక రాజకీయ నేత చెల్లెల్ని ఓ యువకుడు అదే పనిగా వేధించసాగాడు. తనను ప్రేమించాలని తీవ్ర ఒత్తిడి చేసేవాడు. విషయాన్ని ఆ యువతి తన సోదరుని చెవిన వేసింది. తన చెల్లెలు వైపు కన్నెత్తి చూడవద్దని, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆ నాయకుడు సదరు యువకున్ని హెచ్చరించాడు. అయినా వినకపోవడంతో తన చెల్లెల్ని వేధిస్తున్న యువకున్ని ఆ స్థానిక రాజకీయ నేత పట్టుకుని, అతని పురుషాంగాన్ని కోసేశాడు. తీవ్ర రక్తస్రావమై ఆ యువకుడు మరణించాడు. అయినప్పటికీ ఆ స్థానిక నేత శాంతించలేదు. కోసిన పురుషాంగాన్ని ఆ యువకుడి నోట్లో పెట్టి వరంగల్ నగరంలోని కాశీబుగ్గ వీధుల్లో ఊరేగించాడు. అప్పట్లో ఇదో సంచలనం. దాదాపు మూడున్నర దశాబ్ధాల క్రితం, అంటే 1985 ప్రాంతంలో జరిగిన ఘటన. చట్ట ప్రకారం నిందితులపై పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేసినట్లు కూడా గుర్తు. ఘటన పూర్తి వివరాలు అడక్కండి. కాశీబుగ్గ ప్రాంతంలోని అప్పటి తరం ప్రజలకు ఈ సంచలన సంఘటన సుపరిచితమే.

Comments are closed.

Exit mobile version