కాన్పూర్ రౌడీషీటర్ వికాస్ దూబే కొద్దిసేపటి క్రితం పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యాడు. ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ ఎన్కౌంటర్ ఘటనలో డీఎస్పీ సహా ఎనిమిది మంది పోలీసులను పొట్టన బెట్టుకున్న వికాస్ దూబేను నిన్న మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని టెంపుల్ వద్ద పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే శుక్రవారం ఉదయం వికాస్ దూబేను పోలీసులు ప్రత్యేక వాహనంలో కాన్పూర్ కు తరలిస్తుండగా, పోలీసుల ఎస్కార్ వాహనం ప్రమాదవశాత్తు మార్గమధ్యంలో బోల్తాపడింది. ఇదే అదునుగా భావించిన వికాస్ దూబే పారిపోయేందుకు ప్రయత్నించాడు. అనివార్యంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో వికాస్ దూబే అక్కడిక్కడే మరణించాడు.