టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మెన్, సినీనటి విజయశాంతి బీజేపీలో చేరికకు ముహూర్తం ఖాయమైనట్లేనా? ఆదివారం హైదరాబాద్ పర్యటనకు వస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకోనున్నారా? తన ఫేస్ బుక్ పేజీలోని రాహూల్ గాంధీ ముఖం గల కవర్ ఫొటోను తొలగించడం ఈ ప్రశ్నలను రేకెత్తిస్తోంది.
మరోవైపు విజయశాంతి ఆదివారం బీజేపీలో చేరికకు రంగం సిద్ధం చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో విజయశాంతి ఫేస్ బుక్ కవర్ ఫొటో మార్పు సైతం చర్చనీయాంశంగా మారింది. ‘సత్యమేవ జయతే’ స్లోగన్ తో రాష్ట్ర అసెంబ్లీ ముందు గల మహాత్మాాగాంధీ విగ్రహం ఫొటోను విజయశాంతి తాజాగా తన ఫేస్ బుక్ కవర్ ఫొటోగా మార్చడం గమనార్హం.