కరోనా కల్లోల పరిణామాల్లో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాస్క్ లేకుండా చేసిన డాన్స్ వీడియో ఒకటి వివాదాస్పదమవుతోంది. గతంలో కరోనా బారిన పడి, చికిత్స కూడా తీసుకున్న మధుసూదన్ రెడ్డి ఎటువంటి పాఠం నేర్చుకోకుండా కరోనా సూపర్ స్ప్రెడర్ గా మారారని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా విరుచుకుపడ్డారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాల సందర్భంగా విద్యార్థుల మధ్య ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కనీసం మాస్కు లేకుండా చిందులేయడమేంటని నారా లోకేష్ ప్రశ్నించారు. ఈమేరకు నారా లోకష్ వీడియోను ట్వీట్ చేసిన వీడియోను దిగువన చూసేయండి.