ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ కొరడా దెబ్బలు తిన్నారు. ప్రజాశ్రేయస్సును కాంక్షిస్తూ ఆయన కొరడా దెబ్బలను తినడం విశేషం. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో గల నాయకుడు ప్రజల కోసం కొరడా దెబ్బలు తినడమేమిటని నివ్వెరపోకండి. సీఎం హోదాలో ఉన్నప్పటికీ, అచారాలను, సంప్రదాయాన్ని గౌరవిస్తూ భూపేష్ బాఘెల్ కొరడా దెబ్బలు తినడమే అసలు ప్రత్యేకత.
ఛత్తీస్ గఢ్ లోని దుర్గ్ జిల్లా జజంగిరి గ్రామంలో ఏటా దీపావళి పర్వదినం సందర్భంగా గోవర్ధన్ పూజ నిర్వహిస్తారు. ఈ పూజా కార్యక్రమంలో సీఎం భూపేష్ బాఘెల్ కూడా పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రజల శ్రేయస్సును కోరుకుంటూ తన చేతిమీద కొరడా దెబ్బలు కొట్టించుకుంటుంటారు. ఎప్పటిలాగే సీఎం భూపేష్ ఈసారి కూడా ఆచారాన్ని పాటిస్తూ దీపావళి రోజున కొరడా దెబ్బలు తిన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను సీఎం భూపేష్ తన ట్విట్టర్ ఖాతలో పోస్ట్ చేశారు. దిగువన మీరూ చూసేయండి.