Facebook Twitter YouTube
    Sunday, June 4
    Facebook Twitter YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»Crime News»విక్టిమ్ బ్లేమింగ్, ట్విట్టర్ సానుభూతులు, ఛీ… అసహ్యమేస్తున్నది!!

    విక్టిమ్ బ్లేమింగ్, ట్విట్టర్ సానుభూతులు, ఛీ… అసహ్యమేస్తున్నది!!

    November 30, 20193 Mins Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29 ts29

    ఘోర ఘటనలో బాధితులకు స్వాంతన చేకూర్చే దిశగా పాలకుల చర్యలు ఉండాలి. కనీస సానుభూతి సంగతి అలా ఉంచి బాధితురాలినే బద్నాం చేసే విధంగా వ్యాఖ్యలు చేస్తే బాధ్యతారాహిత్యం అవుతుంది. వ్యవస్థల ధ్వంసం నేపథ్యంలో బాధితులను బద్నాం చేసే చర్యలకు సమాజం కూడా సంతృప్తి చెందుతోంది. ఈ తరహా బాధితుల బద్నాం ప్రక్రియకు విలువ పెంచడానికి ఆస్థాన ప్రవచనకర్తలు కూడా ఎలాగూ ఉన్నారంటున్నారు సీనియర్ జర్నలిస్టు సి. వనజ. వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి ఘటనలో విక్టిమ్ బ్లేమింగ్ వ్యాఖ్యల తీరును చూస్తుంటే ‘ఛీ… అసహ్యమేస్తున్నది’ అంటూ ఆమె తన ఫేస్ బుక్ లో రాసుకున్న పోస్టు ts29.in పాఠకుల కోసం యధాతథంగా….

    విక్టిమ్ బ్లేమింగ్ :
    100 కి డయల్ చేసి ఉంటే బతికి ఉండేది… 100 కి డయల్ చేసి ఉంటే బతికి ఉండేది. ఉదయం నుంచి వాట్సప్ లో సోషల్ మీడియాలో వినివిని చికాకొస్తోంది. చివరికి డీజీపీ, పోలీసు కమిషనర్లు, హోం మంత్రి కూడా ఇదే పాట. ఆమె 100 కి డయల్ చెయ్యలేదు కనుక అమెకిలా జరిగింది. ఆమె అలాంటి బట్టలు వేసుకుంది కనుక అలా జరిగింది. ఆమె ఆ టైమ్ లో బయటికి వెళ్ళింది కనుక అలా జరిగింది అనటానికి దీనికి తేడా ఏమిటి? ఇంకొంత మంది ఇంకో అడుగు ముందుకు వేసి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన వెంటనే వాళ్ళ తల్లితండ్రులు అక్కడికి ఎందుకు పోలేదు? అనికూడ అంటున్నారు. ఇదంతా కూడా విక్టిమ్ బ్లేమింగ్.

    ఒకవైపు వ్యవస్థల ధ్వంసం. మరోవైపు బాధ్యతారహిత మైన ప్రభుత్వాలు ఉన్నపుడు సమాజం ఇలా విక్టిమ్ బ్లేమింగ్ చేసుకొని తప్పుడు సమాధానాలతో సంతృప్తి పడుతుంది. ఈ విక్టిమ్ బ్లేమింగ్ కి వాలిడిటీ ఇవ్వటానికి మనకు ఆస్థాన ప్రవచన కర్తలు ఎలాగూ ఉన్నారు కద!

    ts29 2

    నిజంగా 100 కి డయల్ చేస్తే ఆమె save అయ్యేదా? ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన గంటలోపల ఆమె తల్లి తండ్రులు మూడు పోలీసు స్టేషన్లను ఫోన్ లో అప్రోచ్ అయ్యారు. ఎవరికి వారు తమ jurisdiction కాదని తప్పించుకున్నారట. ఇది నిర్భయ ఘటనలో కూడా చూసాం. ఆమె చావు బతుకుల్లో రోడ్డు మీద పడి ఉంటే పోలీసులు jurisdiction అనే వికృత క్రీడ గంటకు పైగా ఆడారు. ఆ తర్వాత జరిగిన చర్చల్లో, నిర్భయ చట్టం వచ్చిన సందర్భంలో ఒక crime ని ఆపడానికి ఇది సాకు కాకూడదని కోర్టు లు తేల్చాయి. కంప్లైంట్ ఎక్కడ ఇచ్చిన తీసుకుని, zero FIR బుక్ చేసి తర్వాత jurisdiction ఉన్న PS కి ట్రాన్స్ఫర్ చెయ్యాలని స్పష్టంగా చట్టం ఉంది. కానీ jurisdiction వికృత క్రీడ అలవాటయిన వాళ్లకు ఈ చట్టం ఎక్కదు. 100 కి డయల్ చేసినా ఇదే వికృత క్రీడ ఉంటుంది. 100 కి వచ్చే పోలీసులు కూడా వాళ్ళే కదా. 100 కి డయల్ చెస్తీ రెస్పాన్స్ రాని వేలాది కథల మాటేమిటి?

    కానీ ఆ తల్లితండ్రులు రాత్రి 11.00 గంటలకు jurisdiction కనుక్కుని స్వయంగా పోలీస్ స్టేషన్ కి వెళ్తే వాళ్ళకు వచ్చిన సమాధానం ఏమిటి? ఎవరితో అయినా పోయి ఉంటుంది. చివరి ఫొన్ కాల్ లో ఫలానా పరిస్థితి లో ఉన్నానని, భయం వేస్తుందని, ఒక అమ్మాయి ఏడుస్తూ చెప్పిందని చెప్తే కూడా లేచిపోయి ఉంటుందిలే అన్నదే ఫ్రెండ్లీ పోలీసు సమాధానం. ఇలాంటి సమాధానాలు ఇచ్చే కదా? హజిపుర్ లో ముగ్గురు ముక్కుపచ్చలారని ఆడపిల్లలను బలి ఇచ్చింది. అదే పాఠంగా తీసుకుని పోలీసులను, వ్యవస్థను అప్పుడే సెట్ రైట్ చేసి ఉంటే ఇవ్వాళ ఇది అపగలిగే వాళ్ళు కాదా? ఏ అమ్మాయి మిస్సింగ్ కంప్లైంట్ వచ్చినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని రెస్పాండ్ అవ్వండి అని కింది దాకా మెసేజ్ పంపాల్సిన అధికారులు, మంత్రులు, ఆడపిల్ల వైపు చూస్తే కళ్లు పీకేస్తామన్న ముఖ్యమంత్రులు ఆపని చెయ్యకుండా విక్టిమ్ బ్లేమింగ్ కి దిగటం ఎలాంటి దగుల్బాజీతనం?

    మరోవైపు సమాజంలో విపరీతంగా పెరిగిపోతున్న హింసా సంస్కృతి నీ మార్చటానికి ప్రభుత్వాలు ఎం చేస్తున్నాయి? ఏడాది తర్వాత ఏడాది మహిళలపై హింస లో తెలంగాణ అగ్రభాగాన నిలబడుతుంటే ఏలిన వారు దాన్ని మార్చటానికి ఏమైనా చేస్తున్నట్లు ఎప్పుడైనా ఒక్క మాటైనా మాట్లాడటం విన్నారా? మీకు మెక్కటానికి బంగారు తెలంగాణా వచ్చింది సరే, మా జెండర్ సేఫ్ తెలంగాణా ఎప్పటికైనా వస్తుందా? అప్పుడప్పుడూ ట్విట్టర్ లో సెలెక్టివ్ outrage చూపిస్తే ఇది ఆగుతుందా? అసలు దీన్ని మార్చటానికి మీ దగ్గర ఏదైనా ప్లాన్ ఉందా?

    అన్నిటికీ ప్రభుత్వాలని అంటే ఎలా? ఇంటినుంచి మార్పు రావాలి అని సన్నాయి నొక్కులు నొక్కకండి. ప్రభుత్వాలు చెయ్యాల్సింది చాలా ఉంది. జెండర్ ఎడ్యుకేషన్ తేవాలి స్కూలు స్థాయి నుంచి. ప్రభుత్వం లో ప్రతి ఉద్యోగికి జెండర్ training ఇవ్వాలి. అటు పేదరికం వల్ల పట్టించుకునే కుటుంబం లేక, ఇటు బతకటానికి అవసరమయ్యే ఏ skill రాక, నేర్పే వాళ్ళూ లేక, ఫ్రస్టేషన్ నుంచి మీరు ఫ్రీగా అందిస్తున్న పోర్న్ చూసి పెర్వర్ట్ లు గా మారుతున్న teens ని reach out కావాలి. చెయ్యదలుచుకుంటే ఇన్కా చాలా ఉన్నయి. ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటీ మార్పులు ఉద్యమాల వల్ల దాని వల్ల ఏర్పడె పొలిటికల్ విల్ వల్ల మాత్రమే జరుగుతాయి. మనకు ఉద్యమాలు గిట్టవు. పొలిటికల్ విల్ లేదు.

    చెయ్యాల్సినవి ఏమీ చెయ్యకుండా, అడుగడుగునా బాధ్యతా రాహిత్యం ప్రదర్శిస్తూ, కేవలం విక్టిమ్ బ్లేమింగ్ చెస్తున్న, twitter సానుభూతులు, పరిష్కారాలు చూపిస్తున్న అధికారులను, మంత్రులను చూస్తుంటే, పరమ అసహ్యం వేస్తుంది. ఛీ…
    -C Vanaja

    Previous Articleప్రియాంకారెడ్డి కేసులో జనామోదం చాలు, మూర్ఖపు వాదన కాదు!
    Next Article నక్సలైట్లనైనా కొన్నిసార్లు వదిలేవాడు, కానీ దొంగలు కనిపిస్తే ఫైరింగే, ఓ ఐపీఎస్ తీరు! ఎందుకలా?

    Related Posts

    దొడ్డ మనసులో వద్ది‘రాజు’

    May 12, 2023

    ఖమ్మంలో బీజేపీ నేతల అరెస్ట్

    May 5, 2023

    పొంగులేటి ఇంట్లో పొలిటికల్ స్కెచ్ ఏంటి?

    May 4, 2023

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook Twitter YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.