కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందని ప్రపంచ ప్రజానీకం ఊరట చెందుతున్న పరిస్థితుల్లో, ఆయా వ్యాక్సిన్ తీసుకున్న హెడ్ నర్స్ ఒకరు మాట్లాడుతూనే కుప్పకూలిన వీడియో వైరల్ గా మారింది. అమెరికాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వీడియో ఇప్పుడు ప్రపంచాన్ని చుట్టేస్తోంది. టేనస్సీలోని సీహెచ్ఐ మెమోరియల్ ఆసుపత్రిలో టిఫనీ డోవర్ అనే హెడ్ నర్స్ మీడియా సమావేశంలో మాట్లాడారు. తాను కరోనా వ్యాక్సిన్ తీసుకున్నందుకు సంతోషిస్తున్నానని ప్రకటించిన క్షణాల్లోనే ఆమె కుప్పకూలడం కలకలానికి దారి తీసింది.

హెడ్ నర్స్ టిఫనీ డోవర్ ఫైజర్-బయోఎన్‌టెక్ కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్నారు. అనంతరం విలేకరుల ప్రశ్నలకు సమాధానాలిస్తూనే, సారీ… అంటూ పడిపోయారు. దీంతో వ్యాక్సిన్, భద్రత తదితర అంశాలపై పలు సందేహాలను కల్పించిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం నర్స్ టిఫనీ డోవర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు మరోవైపు వార్తలు వస్తున్నాయి. మీడియాతో మాట్లాడుతూ నర్స్ టిఫనీ డోవర్ కుప్పకూలిన దృశ్యపు వీడియోను దిగువన చూడవచ్చు.

Comments are closed.

Exit mobile version