బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు పది మంది కమాండోలతో వై ప్లస్ భద్రత కల్పించడంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మహారాష్ట్ర ప్రభుత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలతో హల్ చల్ చేస్తున్న కంగనా రనౌత్ కు వై ప్లస్ భద్రతను కల్పించడంపై వివిధ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కిషన్ రెడ్డి ఇచ్చిన క్లారిటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
తన కుమార్తె వేధింపులకు గురవుతున్నట్లు కంగన తండ్రి హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారన్నారు. ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ సీఎం విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లగా, ఆమెకు వై ప్లస్ భద్రతను కల్పించినట్లు కిషన్ రెడ్డి వివరించారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానంతరం కంగన, మహారాష్ట సర్కార్ కు చెందిన నేతల మధ్య మాటల యుద్ధం పెరిగిన సంగతి తెలిసిందే.