సుప్రసిద్ధ కాకతీయ శిల్పకళా సంపద రామప్ప దేవాలయానికి అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తింపు లభించింది. చైనాలోని ఫ్యూజులో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశంలో ఈమేరకు నిర్ణయించారు. దాదాపు 800 ఏళ్ల క్రితం కాకతీయులు నిర్మించిన రామప్ప దేవాలయం శిల్పకళా సంంపదకు చిరునామాగా ప్రాచుర్యం పొందింది.
దేశం నుంచి 2020 సంవత్సరానికిగాను రామప్ప దేవాలయం మాత్రమే ఇందుకు నామినేట్ కావడం విశేషం. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలో క్రీస్తు శకం 1213లో దీన్ని నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ గుర్తింపు పొందిన తొలి కట్టడంగా రామప్ప దేవాలయం రికార్డు సృష్టించడం మరో ఆసక్తికర అంశం.