‘ఉబుంటు’.. ఆఫ్రికాలో ఒక మంచి కథ..
ఆఫ్రికాలోని గిరిజన పిల్లల కోసం ఒక మానవ శాస్త్రవేత్త కొత్త ఆట ప్రతిపాదించాడు.
ఒక చెట్టుకింద బుట్టలో చాలా స్వీట్లు పెట్టాడు.
పిల్లలందరినీ 100 మీటర్ల దూరంలో నిలుచోమన్నాడు.
తాను చెప్పగానే ఎవరు ముందుగా బుట్ట దగ్గరికి వస్తారో… అందులో స్వీట్లన్నీ వారికే అని చెప్పాడు.
కానీ, ఆ పిల్లలేం చేశారో తెలుసా…
అందరూ కలిసి ఒకరి చేతులు ఒకరు పట్టుకొని చెట్టుదగ్గర ఉన్న బుట్ట దగ్గరకు వెళ్లారు.
దాంతో ఆ స్వీట్లన్నీ వాళ్లందరూ కలిసే తినాల్సి వచ్చింది.
కొద్దిసేపటికి ఆ మానవ శాస్త్రవేత్త ఆ పిల్లలను అడిగాడు..
ఎందుకిలా చేశారు అని ?
దానికి వారంతా ఒకేసారి సమాధానం చెప్పారు ‘ఉబుంటు’ అని!
దానర్ధం… మనం ఒక్కరమే ఎలా సంతోషంగా ఉంటాం.. మిగలిన వారంతా బాధలో ఉంటే.. అని.
అందుకే.. నేను అంటే.. మనమందరం.. అనేది అన్ని తరాలకు బలమైన సందేశం. ఇదీ ఆప్రికాలో ఓ మంచి కథ సంగతి.