మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు అగ్రనేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు వారణాసి సుబ్రహ్మణ్యం అలియాస్ శ్రీకాంత్ అలియాస్ అమన్, అలియాస్ విమల్, అతని భార్య విజయలక్ష్మి ఉన్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ప్రకటించారు. ఆయన కథనం ప్రకారం… ఆదివారం ఉదయం మంచిర్యాల క్యాతనపల్లి లో నివసిస్తున్న గురిజాల రవీందర్ రావు ఇల్లు తనిఖీ చేయగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు వారణాసి సుబ్రహ్మణ్యం,అతని భార్య జిల్లా కమిటీ సభ్యురాలు విజయలక్ష్మి అలియాస్ శ్రీధర 20 రోజులపాటు అతని ఇంట్లో ఉన్నట్టు తేలింది. మళ్లీ కోల్ బెల్ట్ ఏరియాలో ‘సింగరేణి కార్మిక సమాఖ్య’ (సికాస)ను పూర్తిస్థాయిలో పునరుద్ధరించడానికి సమావేశం జరిపారు. వారు ప్రతి రోజు బయటకు వెళ్లి పాత ‘సికాస’ నాయకులను, కార్యకర్తలను కలిసి సికాస అభివృద్ధికి కృషి చేశారు. ఈ రెండు మూడు రోజులలో రవీందర్రావు ఇంటికి వారణాసి సుబ్రహ్మణ్యం, విజయలక్ష్మి మళ్ళీ రాబోతున్నట్టు సమాచారం మేరకు వివిధ ప్రదేశాలలో పోలీస్ బృందాలు పెట్టి తనిఖీలు చేయించారు.

ఆదివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన వారణాసి సుబ్రహ్మణ్యం @ శ్రీకాంత్ @అమన్ @విమల్ ను అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్ట్ పార్టీ అనుబంధ సంస సికాస వ్యవస్థాపకులలో విమల్ ఒకరు. 1980లలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆయన పని చేశారు. 2004 లో సిపిఐ మావోయిస్టు పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. సెంట్రల్ కమిటీ మెంబర్ వరకూ ఎదిగాడు. సిపిఐ మావోయిస్టు పార్టీ నార్త్ రీజినల్ బ్యూరో పరిధిలో ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా హర్యానా, పంజాబ్, ఢిల్లీ ప్రాంతాలలో పనిచేస్తూ 2011 సంవత్సరంలో బీహార్ లో అరెస్ట్ అయ్యారు. 2019లో బెయిలుపై విడుదలయ్యారు. వెంటనే మళ్లీ సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీని కలిసి వారి సూచన మేరకు సికాసను పునర్ నిర్మాణం చేసే టాస్క్ ను విమల్ కు అప్పగించారు.అందులో భాగంగా మంచిర్యాల జిల్లా క్యాతన్ పల్లిలో తన పూర్వ సహచరుడైన గురిజాల రవీందర్రావు ఇంటికి 2020 నవంబర్ లో తన భార్యతో సహా వచ్చి 20 రోజులు ఉన్నారు. కోల్ బెల్ట్ ఏరియాలో తిరుగుతూ పార్టీ పూర్వ కార్యకర్తలతో సమావేశాలు జరిపి వెళ్ళిపోయినారు. ఉత్తర భారత దేశంలో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలలో పాల్గొనే క్రమంలో చండీఘడ్ నుంచి భార్యతో కలిసి వస్తున్న క్రమంలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వారణాసి సుబ్రహ్మణ్యం అలియాస్ విమల్ భార్య విజయలక్ష్మి, మావోయిస్టు పార్టీలో ఢిల్లీ సిటీ కమిటీలో పని చేశారు. బెంగళూరుకు చెందిన ఈమె 1990లో బ్యాంక్ ఆఫ్ మైసూర్ లో పనిచేస్తూ వారణాసి సుబ్రహ్మణ్యం ను పెళ్లి చేసుకున్నారు. తరువాత 1996లో వీఆర్ఎస్ తీసుకుని వారణాసి సుబ్రహ్మణ్యం తోపాటు పార్టీ లో పనిచేస్తూ ఉత్తర భారతదేశంలో, ముఖ్యంగా ఢిల్లీకి కమిటీలో పని చేస్తూ ఉండగా 2011లో వారణాసి సుబ్రహ్మణ్యం అరెస్టయ్యారు. వెంటనే పార్టీ సూచన మేరకు షెల్టర్లు మారుస్తూ వచ్చారు. వివిధ ప్రదేశాలలో డెన్ లను నిర్వహిస్తూ 2019లో వారణాసి సుబ్రహ్మణ్యం బెయిల్ పై బయటకు వచ్చిన తరువాత పార్టీ నిర్ణయం మేరకు 2020 జనవరిలో వారణాసి సుబ్రహ్మణ్యం కలిసి అతనితో పాటు కార్యకలాపాలలో పాలు పంచుకుంటూ ఉన్నారు. వారి వద్ద నుండి పార్టీ సాహిత్యం స్వాధీనం చేసుకున్నామని, విమల్ దంపతులను కోర్టులో హాజరు పరుస్తున్నామని సీపీ సత్యనారాయణ వివరించారు.

Comments are closed.

Exit mobile version