విషాద ఘటన. వాగ్వాదానికి దిగిన ఇద్దరు కానిస్టేబుళ్లు పరస్పరం తుపాకులతో కాల్చుకుని మరణించారు. పొరుగున గల ఛత్తీస్ గఢ్ లోని నారాయణపూర్ జిల్లా అండీ వ్యాలీ క్యాంపులో కొద్ది సేపటి క్రితమే ఈ దుర్ఘటన జరిగింది.
అండీ వ్యాలీ క్యాంపులో విధులు నిర్వహించే భద్రతా బలగాల మధ్య శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో వాగ్వాదపు ఘటన చోటు చేసుకుంది. ఈ ఉదంతం జవాన్ల మధ్య తీవ్ర ఘర్షణకు దారి తీసింది. దీంతో తుపాకులతో పరస్పరం కాల్పులు జరుపుకుని ఇద్దరు పోలీసులు మృతి చెందారు. మరో కానిస్టేబుల్ గాయపడగా, చికిత్స కోసం అతన్ని రాయపూర్ ఆసుపత్రికి తరలించారు. మరణించిన కానిస్టేబుళ్లను ఘనశ్యామ్ సాహు, బింతేశ్వర్ సాహ్నిగా అధికారులు ప్రకటించారు. ఘటనకు సంబంధించి మరో కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకున్నారు. ఘోర ఉదంతాన్ని బస్తర్ ఐజీ ధృవీకరించారు.