ఇదీ ts.29.in సత్తా. ఇలా చెప్పుకోవడం గర్వం కాదు. గౌరవ కారణం… గర్వకారణం… సంతోషకర సందర్భం కూడా. సరైన దారిలోనే పయనిస్తున్నామనే సంతృప్తి. జర్నలిజంలో అనేక రకాలు. మెయిన్ స్ట్రీమ్ జర్నలిజం వేరు. సోషల్ మీడియా, వెబ్, బ్లాగ్, యూ ట్యూబ్, పోర్టల్… పేర్లు ఏవైనా పెన్ను నుంచి… అంటే ప్రస్తుత ఆధునిక కాలంలో కంప్యూటర్ కీ బోర్డు నుంచి వెలువడే అక్షరాలే జనహిత జర్నలిజానికి అసలు సిసలు ప్రామాణికం. వ్యవస్థ ఏదైనా, సంస్థ ఏదైనా అక్షరాల్లో బలం, విశ్వసనీయత ఉంటేనే ప్రశంసలు లభిస్తాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు.
గత అక్టోబర్ 24న ప్రారంభించిన ts29.in వెబ్ సైట్ సమాజంలోని ప్రముఖుల ప్రశంసలను సంపాదించుకుంటున్నది. అదీ అసలు విశేషం. మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులకు సోర్స్ గా నిలుస్తోందనే ప్రముఖ పత్రికల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్ జర్నలిస్టుల అభినందనలను తన ఖాతాలో వేసుకుంటున్నది. ‘చరిత్ర’ బోధనలో కాకతీయ విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణులైన ఆచార్యుల నుంచి కూడా మన్ననలు పొందుతోంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాకు తీసిపోని విధంగా రాష్ట్ర మున్సిపల్ మంత్రి కేటీఆర్ స్పందనకు నోచుకోవడం వెబ్ జర్నలిజంలో ఈ పోర్టల్ కథనాల్లో ప్రత్యేకతగా కాలర్ ఎగరేస్తూ చెప్పడానికి నిదర్శనం కూడా ఉంది. కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా భావించే మేడారం జాతరకు సంబంధించి ts29.in ప్రచురించిన వార్తా కథనాలపై లభించిన అనేక ప్రశంసల్లో ముఖ్యమైన వాటిని ఇక్కడ చూడవచ్చు.
ఇదే సమయంలో ఈ వెబ్ సైట్ ను చూసి ఓర్వలేని వ్యక్తుల కుళ్లు, చూడలేని కొన్ని కళ్లు కూడా బహిరంగంగానే బట్టలు చించుకుంటున్నాయన్నది వేరే విషయం. మెయిన్ స్ట్రీమ్ జర్నలిజమైనా, మరే ఇతర జర్నలిజమైనా ఈ కలానికి తెలిసింది వృత్తి నిబద్ధత మాత్రమే. సద్విమర్శలను సైతం స్వీకరిస్తూ, ప్రశంసలకు రొమ్ము విరుచుకుంటూ ts.29.in తన జర్నలిజపు ప్రయాణాన్ని నిరంతరంగా కొనసాగిస్తూనే ఉంటుంది. కేవలం 100 రోజుల పైచిలుకు వెబ్ జర్నలిజపు ప్రయాణంలో లభించిన ఇటువంటి అనేక ప్రశంసలకు హృదయపూర్వక ప్రణామాలు.
-ఎడమ సమ్మిరెడ్డి