తన సేవల ప్రచారం కోసం ఆర్టీసీ సోషల్ మీడియాను ఆశ్రయించింది. ఈరోజుల్లో సోషల్ మీడియాకు ఉన్నటువంటి ఫాలోయింగ్ మరెందులోనూ లేదనే భావనకు కూడా వచ్చింది. అందుకే కాబోలు తమ కార్గో సేవలను వినియోగించుకోవాలని ఆర్టీసీ బాధ్యులు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ప్రచారం చేస్తుండడం విశేషం.
కరోనా మహమ్మారి కారణంగా బస్సులు నడవక దినసరి కోట్లాది రూపాయల నష్టాన్ని చవి చూడాల్సి వస్తున్నదని, ఇటువంటి విపత్కర పరిణామాల్లో ఆర్టీసీని కాపాడుకోవలసిన అవసరముందని అభ్యర్థిస్తున్నారు. తమ సంస్థ ప్రారంభించిన కార్గో సర్వీసులను ఉపయోగించుకోవాలని ఆర్టీసీ డిపో మేనేజర్ల పేరుతో సోషల్ మీడియా పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన హుస్నాబాద్ డిపో మేనేజర్ పేరుతో గల ఆయా పోస్టును యథాతథంగా దిగువన చదవండి.
ఆర్టీసీ కార్గో & పార్శిల్ సర్వీసు
సభ్య సమాజానికి బహిరంగ విన్నపం
మిత్రులారా… ఆర్టీసీ బస్సు చక్రాలు ప్రగతి రథ చక్రాలన్నాడు ఓకవి ఏనాడో
ఎందుకంటే, ఎక్కడో వున్న మారు మూల పల్లెకు ఆర్టీసీ బస్సు వస్తోందంటే అ వూరు అభివృద్ధికి తొలి మెట్టు ఆర్టీసీ బస్సు చక్రమని అందరికీ తెలుసు.
దదాపు 70 ఏళ్ళ నుంచి పేద, మధ్య తరగతి వారికి అతి తక్కువ చార్జీలు వసూలు చేస్తూ సురక్షితమైన ప్రయాణ సౌకర్యాన్ని అందించడమే గాక బడి పిల్లలకు, కాలేజీ పిల్లలకు ఉచిత మరియు రాయితీ బస్సు పాసులనిచ్చింది.
అంతే కాక, గర్భిణీ మహిళలకని, కిడ్నీ వ్యాధిగ్రస్థులకని, జర్నలిస్టులకని, ప్రీడమ్ పైటర్స్ అని, NGO’S కని ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరికో సేవలందించిన ఆర్టీసీ నేడు కరోనా మహమ్మారి వల్ల బస్సులు నడవక రోజుకు కోట్ల రూపాయల నష్టాలను చవి చూస్తూంది.
మరి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆర్టీసీని కాపాడుకోవాలంటే… ప్రయాణీకులను చేరవేయడమే గాక వస్తువులను కూడా చేరవేస్తూ లబ్ది పొంది సంస్థను ఎలాగైనా కాపాడుకోవాలనే తపనతో మరియు భావి తరాలకు కూడా ఆర్టీసీ సేవలందించేలా ఆర్టీసీని నిలబెట్టాలని నేడు కార్గో-పార్సిల్ సర్వీసును ప్రారంభించడం జరిగింది.
కావున
మిత్రులారా… మీ మీ కంపెనీలో, ఏజెన్సీలనే గాక మీ పర్సనల్ వస్తువులను కూడా ఒక చోట నుంచి మరో చోటుకు చేరవేయుటకు మా యొక్క transport
ఐన ఆర్టీసీ Cargo-parcel service ను ఉపయోగించుకోవాలని కోరడమైనది. అతి తక్కువ రేట్లతో, మీరు అనుకునే గమ్యానికీ అనుకున్న సమయానికి సురక్షితంగా చేరవేయుటకు సిద్ధముగా వున్నది.
కావున, దయచేసి అందరూ మీ మీ business transport కార్యకలాపాల్లో ఆర్టీసీ కార్గో-పార్సిల్ సర్వీసును వాడుకుంటూ మీలో ఆర్టీసీని భాగస్వామం చేసుకోవాలని మనస్ఫూర్తిగా సవినయంగా కోరుకుంటున్నాను.
ధన్యవాదములతో ????
రజనీ కృష్ణ
హుస్నాబాద్ డిపో మేనేజర్.
N0TE :- ప్రియ మిత్రులారా…. ఈ యొక్క సమాచారాన్ని చదివిన ప్రతి ఒక్కరూ కనీసం మరో ముగ్గురికైనా forward చేసి ఆర్టీసీ కార్గో సర్వీసుల సేవలను అందరూ వినియోగించుటకు దోహద పడుతారని ఆశిస్తున్నాను.
ఎందుకంటే, ఈ రోజుల్లో social media కు వున్నంత following దేనిలోనూ ఉండటం లేదు. ఇది మంచి advertisement కాబట్టి.