తెలంగాణాలో ఎన్నికలు జరిగిన రెండు కార్పొరేషన్లతోపాటు అయిదు మున్సిపాలిటీలు అధికార పార్టీ వశమయ్యాయి. గ్రేటర్ వరంగల్, ఖమ్మం నగర పాలక సంస్థల్లోనేగాక, సిద్ధిపేట, కొత్తూరు, అచ్చంపేట, జడ్చర్ల, నకిరేకల్ మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది.
వరంగల్ మహానగర పాలక సంస్థలో 66 డివిజన్లు ఉండగా ఈ వార్త రాసే సమయానికి ఫలితాలు వెలువడిన 62 డివిజన్లలో 43 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. అదేవిధంగా ఖమ్మం కార్పొరేషన్ లో 60 డివిజన్లు ఉండగా, ఫలితాలు వెలువడిన 54 స్థానాల్లో 40 డివిజనల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు.
ఎన్నికలు జరిగిన మరో అయిదు మున్సిపాలిటీల్లోని సిద్ధిపేటలో 43 వార్డుల్లోని 33 స్థానాల్లో, కొత్తూరులోని 12 వార్డుల్లో ఏడింట, అచ్చంపేటలోని 20 వార్డుల్లో 13 స్థానాల్లో, నకిరేకల్ లోని 20 వార్డుల్లోని 11 స్థానాల్లో, జడ్చర్లలోని 27 వార్డుల్లో 23 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో ఆయా కార్పొరేషనల్లో, మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ అభ్యర్థులే మేయర్లుగా, మున్సిపల్ చైర్మెన్లుగా ఎన్నికయ్యేందుకు అవసరమైన మెజారిటీ స్థానాలు లభించినట్లయింది.