టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యారు. ప్రముఖ గ్రానైట్ వ్యాపారి వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి), హెటిరో డ్రగ్స్ అధినేత బండి పార్థసారథి రెడ్డి (బీపీఎస్ రెడ్డి), నమస్తే తెలంగాణా పేపర్ మేనేజింగ్ డైరెక్టర్ దీవకొండ దామోదర్ రావులను రాజ్యసభ అభ్యర్థులుగా టీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు. ఖరారైన ఆయా అభ్యర్థులకు సీఎం కేసీఆర్ బీ ఫారాలు కూడా అందజేశారు. తమను ఎంపిక చేసినందుకు ఆయా అభ్యర్థులు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపగా, సీఎం కేసీఆర్ వారిని అభినందించారు.