‘మేం కన్నెర్ర జేస్తే దుబ్బాకలో ఉంటవా? మా పార్టీ నేతలకు వ్యతిరేకంగా వాట్సప్ గ్రూపుల్లో పోస్టులు పెడ్తవా? నేను మాట్లాడేది రికార్డు చేస్తున్నవా… చేస్కో… కేసు పెట్టుకో…? …. పగులగొడ్తా’ అంటూ దుబ్బాకకు చెందిన అధికార పార్టీ నాయకుడొకరు మరో జర్నలిస్టును బెదిరించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ జర్నలిస్టుపై పటాన్ చెరు ఎమ్మెల్యే బూతుపురాణపు ఘటన పరిణామాలను ఇంకా మరువకముందే, అదే ఘటనను ప్రస్తావిస్తూ, అధికార పార్టీకి చెందిన మరో నేత ఇంకో జర్నలిస్టును ఎలా బెదిరిస్తున్నాడో దిగువన గల ఆడియోలో వినండి. ఇందులోనూ ‘బూతు’ పర్వమే ఉంది. అక్కడక్కడా కాస్త చెవులు మూసుకుని వినాలని ప్రత్యేక మనవి.