‘పవర్’లో ఉన్నపుడు చాలా మంది రాజకీయ నాయకులకు మీడియా కనిపించదు. జర్నలిస్టులంటే లెక్కే ఉండదు. ఈ అంశంలో ఏ పార్టీకి, మరే నాయకుడికీ మినహాయింపు ఉండదనేది నిర్వివాదాంశం. ఈ ప్రస్తావన ఇప్పుడు ఎందుకంటే..
మీడియా విషయంలో ఏడాది క్రితం వరకు అధికారంలో గల బీఆర్ఎస్ నాయకులు అనేక మంది అప్పట్లో ఎలా వ్యవహరించారో జర్నలిస్టులకు తెలియనిదేమీ కాదు. ప్రశ్నించిన విలేకరులను ఉద్ధేశించి.. నీ పేరేంది? నీది ఏ పేపర్? ఏ ఛానల్? అంటూ దబాయిస్తూ మరీ జర్నలిస్టులను టెర్రరైజ్ చేసిన సంఘటనలు అనేకం. ముఖ్యంగా సీఎం హోదాలో కేసీఆర్, మంత్రి హోదాలో కేటీఆర్ వంటి నాయకులు అనేక ప్రెస్ మీట్లలో మీడియాపట్ల, జర్నలిస్టులను ఉద్దేశించి వెటకరిస్తూ చేసిన వ్యాఖ్యలు కళ్ల ముందు ఇంకా కదలాడుతూనే ఉన్నాయి.
‘పవర్’ పోవడంతో ఇప్పుడు పరిస్థితి మారింది. బీఆర్ఎస్ నాయకులకు మీడియా అవసరం ఏర్పడింది. సంగారెడ్డిలో నిర్వహించిన తన ప్రెస్ మీట్ ను ఎలా కవర్ చేయాలనే అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు జర్నలిస్టులను ఎలా బతిలాడుతున్నారో దిగువన గల వీడియోలో చూడవచ్చు.