తెలంగాణా రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) జిల్లా అధ్యక్షులను ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకు అధ్యక్షుల పేర్లను వెల్లడించారు.

మొత్తం 33 జిల్లాలకు పార్టీ సారథులుగా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకే అవకాశం కల్పించడం విశేషం. కామారెడ్డికి డీసీఎంఎస్ మాజీ చైర్మెన్ ను, కరీంనగర్ కు సుడా చైర్మెన్ ను, సిరిసిల్లకు మాజీ ఎంపీపీని, సంగారెడ్డికి మాజీ ఎమ్మెల్యేను, ములుగు, జయశంకర్ భూపాపల్లి, జనగామలకు జెడ్పీ చైర్మెన్లను, యాదాద్రి భువనగిరికి ఆయిల్ ఫెడ్ చైర్మెన్ ను, వనపర్తికి మున్సిపల్ చైర్మెన్ ను జిల్లా పార్టీ సారథులగా నియమించారు.

సిద్ధిపేట, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలకు పార్లమెంట్ సభ్యులను అధ్యక్షులుగా నియమించారు. మిగతా జిల్లాలకు ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను అధ్యక్షులుగా నియమించారు. జిల్లాల వారీగా టీఆర్ఎస్ అధ్యక్షులుగా నియమితులైనవారి వివరాలు ఇలా ఉన్నాయి.

Comments are closed.

Exit mobile version