మూడు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తూ తెలంగాణా ప్రభుత్వం సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ కలెక్టర్ కె. శశాంకను జీఏడీలో రిపోర్ట్ చేయాలని బదిలీ ద్వారా ఆదేశిస్తూ, ఆయన స్థానంలో ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణణ్ ను నియమించింది.
అదేవిధంగా ఖమ్మం కలెక్టర్ గా మహబూబాబాద్ కలెక్టర్ వీపీ గౌతమ్ ను నియమిస్తూ, ఈయన స్థానంలో అక్కడే అదనపు కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న అభిలాష అభినవ్ కు పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది. ఈమేరకు సోమవారం రాత్రి పొద్దుపోయాక చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.