తెలంగాణాలో ఆరుగురు సబ్ డివిజనల్ పోలీస్ అధికారులను (డీఎస్పీలు) బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వెయిటింగ్ లో గల టి. శ్రీనివాసరావును కరీంనగర్ టౌన్ ఏసీపీగా, పరకాల ఏసీపీ పి. శ్రీనివాస్ ను కాజీపేట ఏసీపీగా, ఇక్కడ పనిచేస్తున్న బి. రవీంద్రకుమార్ ను హైదరాబాద్ చీఫ్ ఆఫీసుకు బదిలీ చేశారు.
అదేవిదంగా వెయిటింగ్ లో గల జూలపల్లి శివరామయ్యను పరకాల ఏసీపీగా, హైదరాబాద్ చీఫ్ ఆఫీసులో వెయిటింగ్ లో గల జి. వెంకటరమణ గౌడ్ ను హెచ్ఎండీఏ డీఎస్పీగా నియమిస్తూ, ఇక్కడ పనిచేస్తున్న జి. జగన్ ను చీఫ్ ఆఫీసులో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.