పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కేడర్ కు తాజా విజ్ఞప్తి చేశారు. రెండు రోజులపాటు పార్టీ కార్యకర్తలను, అభిమానులను, నాయకులను తాను కలిసే అవకాశం లేదన్నారు. ఇందుకు తాను చింతిస్తున్నానని పేర్కొన్నారు. ఈనెల 5, 6 తేదీల్లో నిర్ధారిత కార్యక్రమాలు ఉండడమే ఇందుకు కారణమని చెప్పారు. ఈనెల 7వ తేదీన గాంధీ భవన్ లో కలుద్దామని, దయచేసి అర్థం చేసుకుని సహకరించాలని రేవంత్ రెడ్డి అభ్యర్థించారు.