చిలుకూరు బాలాజీ దేవాలయంలో గల శివాలయంలో ఓ తాబేలు ప్రత్యక్షమైన ఘటన కరోనా వైరస్ అంతానికి శుభ సంకేతమా? ఔనంటున్నారు ఆలయ ప్రధాన పూజారి సీఎస్ రంగరాజన్. ఇక్కడ గల శివాలయంలోకి ఎటువంటి జీవి కూడా ప్రవేశించే అవకాశం లేకపోయినా, కూర్మం (తాబేలు) వచ్చిందని చెబుతున్నారు. ఇది 10 సెంటీమీటర్ల పొడవు, 6 సెంటీమీటర్ల వెడల్పు ఉందని శివాలయం పూజారి సురేష్ ఆత్మారాం చెప్పారు.
ఈ ఘటన కరోనా అంతానికి శుభసంకేతంగా ఆలయ పూజారులు నిర్వచిస్తున్నారు. కూర్మావతారంపైనే మేరుపర్వతాన్ని ఉంచి దేవతలు, రాక్షసులు క్షీరసాగర మథనం చేశారంటున్నారు. ఆ సమయంలో పరమశివుడు హాలాహలాన్ని మింగాడని, చిలుకూరు సుందరేశ్వరస్వామి ఆలయంలో కూర్మం ప్రత్యక్షం కావడం శుభ సంకేతంగా భావిస్తున్నట్లు పూజారులు చెబుతున్నారు. ప్రజలకు అమృతం దక్కుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. తద్వారా వేంకటేశ్వరస్వామి కరోనా వైరస్ నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తాడని రంగరాజన్ చెప్పారు.
ఈ ఘటనపై ఇంకా ఆయనేం చెప్పారో… దిగువన గల వీడియోలో చూసేయండి.