తెలంగాణ అమరవీరులకు టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పెత్రమాస (పితృ అమావాస్య) సందర్భంగా బియ్యం సమర్పించారు. హైదరాబాద్ గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద ఆయన పూజలు నిర్వహించి అమరుల పేరుమీద బియ్యం ఇచ్చారు.
తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల త్యాగాలు వెలకట్టలేనివని కోదండరాం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
అమరుల త్యాగాలు మర్చిపోతే తెలంగాణ తమను తాము మర్చిపోయినట్లేనని ఆయన అన్నారు.
భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, ప్రభుత్వం మాత్రం పూల మొక్కల మీద సమీక్ష చేస్తోందని కోదండరాం మండిపడ్డారు. అమరుల ఆశయాల సాధనకై నిరంతరం పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు