ఆధిపత్యపోరు మానవుల్లోనేకాదు, మృగాలలోనూ ఉంటుంది. ఈ అంశం కొత్తదేమీ కాదు. ఓ మృగం మరో మృగంతో తలపడడం అడవుల్లో సహజమే. కానీ తల్లీ, కూతుళ్లయిన రెండు పులులు పరస్పరం తలపడడమే ఇక్కడ అసలు విశేషం. సాధారణంగా తమ ఆవాస ప్రాంతాల్లోకి ఇతర పులులు వస్తే, అక్కడ అప్పటికే గల పులులు వాటితో పోరాడుతాయి. తమ పిల్లల విషయంలో మాత్రం పులులు ఏమీ అనవని ఇన్నాళ్లూ అటవీ అధికారులు చెబుతుండేవారు.
కానీ దిగువన గల వీడియోను చూశాక అభిప్రాయం మార్చుకోక తప్పదు. ఇలా ఘర్షణ పడుతున్న ఈ రెండు పులులు తల్లీ, కూతుళ్లేనట. వీటి గొడవకు వాటి సంఖ్య పెరగడమే అసలు కారణమట. పెరిగిన తమ సంఖ్యతో ఆవాస ప్రాంతాల స్థలం తగ్గిపోయి తల్లీ, కూతుళ్ల మధ్య భీకరపోరుకు దారి తీసిన పరిణామాలు చోటు చేసుకున్నాయట. రణతంబోర్ నేషనల్ పార్కులో పూణేకు చెందిన ఫొటోగ్రాఫర్ చద్రభాల్ సింగ్ ఈ అరుదైన సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఇక వీడియో చూడండి.