ఖమ్మం డీసీసీబీ మాజీ చైర్మెన్ మువ్వా విజయ్ బాబు నుంచి భారీ ఎత్తున డబ్బు వసూలు చేసేందుకు ప్రయత్నించిన ముగ్గురు విలేకరులను సత్తుపల్లి పోలీసులు గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. విజయ్ బాబు డీసీసీబీ చైర్మెన్ గా వ్యవహరించిన కాలంలో అవినీతి, అక్రమాలు జరిగాయని సూర్య దిన పత్రిక ఇటీవల వరుస కథనాలు ప్రచురిస్తోంది.

సత్తుపల్లిలో సూర్య పత్రిక విలేకరులను పోలీసులు అదుపులోకి తీసుకున్న దృశ్యం

ఈ నేపథ్యంలోనే విజయ్ బాబు నుంచి ఆయా పత్రిక ప్రతినిధులు రూ. 30 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయా భారీ మొత్తాన్ని తీసుకునేందుకు సత్తుపల్లిలోని విజయ్ బాబు నివాసానికి వెళ్లిన సూర్య పత్రిక ఖమ్మం ప్రతినిధులు మూర్తి, సత్యనారాయణ, సత్తుపల్లి విలేకరి శ్రీకాంత్ లను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సత్తుపల్లి సీఐ రమాకాంత్ ఈమేరకు సూర్య పత్రిక ప్రతినిధులను అదుపులోకి తీసుకున్నారు. తనపై నిరాధార ఆరోపణలతో వార్తలు రాసి, మానసిక క్షోభకు గురి చేసి, అక్రమంగా డబ్బు వసూలు చేసేందుకు వచ్చిన సూర్య పత్రిక ప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజయ్ బాబు ఈ సందర్భంగా పోలీసులను కోరారు.

Comments are closed.

Exit mobile version