పోలీస్ స్టేషన్ లోనే చోరీ జరిగిన ఘటన ఆంధప్రదేశ్ లోని నూజివీడులో జరిగింది. ఏపీలో ప్రభుత్వ మద్యం దుకాణాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మద్యం నిల్వలు విక్రయించగా నాలుగు షాపుల నుంచి వచ్చిన నగదును ఎక్సైజ్ అధికారులు నూజివీడు టౌన్ పోలీస్ స్టేషన్ లోని లాకర్ లో భద్రపరిచారు.

బ్యాంకులకు వరుసగా సెలవులు రావడంతో నగదు ను ఈ విధంగా పోలీస్ స్టేషన్ లో దాచారు. అయితే పోలీస్ స్టేషన్ లో రైటర్ గా పనిచేస్తున్న జనార్ధన్ అనే కానిస్టేబుల్ లాకర్ లోని రూ. 16.56 లక్షల నగదును, కొంత బంగారాన్ని కూడా తీసుకుని పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసి జనార్ధన్ కోసం డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో గాలింపు చర్యలు కూడా చేపట్టారు.

విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన జనార్ధన్ ఈనెల 29వ తేదీ నుంచే కనిపించకపోవడంతో అనుమానించిన పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. భద్రత ఉంటుందని భావించి దాచిన పోలీస్ స్టేషన్ లోనే నగదు, బంగారం చోరీ ఘటన జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Comments are closed.

Exit mobile version