కరోనా వైరస్ అంశంలో ఓ టీవీ ఛానల్ జర్నలిస్టు వెంకటకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా గురించి తాజా పరిస్థితులపై ఆయన చేసిన ప్రసంగపు వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారి తీశాయి. కరోనా అంశాన్ని ప్రస్తావిస్తూ, ప్రభుత్వాలతోపాటు, ఓ వర్గపు మీడియా వాస్తవిక స్థితిని దాచి పెడుతోందని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం మనం డేంజర్లో ఉన్నామని, అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరముందని మరీ మరీ గుర్తు చేశారు. ‘డిబేట్ విత్ వెంకటకృష్ణ’ శీర్షికన ఆయన చేసిన ప్రసంగపు వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. కరోనా గురించి వెంకటకృష్ణ ప్రసంగపు సారాంశాన్ని పరిశీలిస్తే….

‘‘మనం డేంజర్ జోన్లో ఉన్నాము. ఇది చెప్పకనే చెబుతున్న వాస్తవము. ప్రభుత్వాలు హైడ్ చేస్తున్నాయి. సెక్షన్ ఆఫ్ మీడియా హైడ్ చేస్తోంది. కాబట్టి మీరూ… అనవసరంగా భ్రమల్లో ఉండొద్దు. భ్రాంతిలో ఉండొద్దు. దయచేసి మనం డేంజర్ జోన్ కు వెళ్లిపోయాం. ప్రభుత్వం ఒకవైపు హాట్ స్పాట్లు, రెడ్ జోన్లనే పదాలు వాడుతూనే… ఏదో కూల్ గా ఉన్నాం… లేకపోతే సేఫ్ గా ఉన్నామని చెప్తున్నారుగాని, దటీజ్ నాట్ ఎటాల్ కరెక్ట్. మనం డేంజర్ జోన్లో ఉన్నాం. దయచేసి ఇంకా, ఇంకా, ఇంకా ప్రికాషన్ గా ఉండండి. కూరగాయల కోసమనో, పాల పాకెట్ల కోసమనో, చాపల కోసమనో, కోళ్ల కోసమనో బయటికి వెళ్లి, అనవసరంగా ఆహారాన్ని కాదు, కరోనాను ఇంటికి తీసుకువచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకునే ప్రయత్నాలు చేయవద్దండి దయచేసి.

నేను మళ్లీ చెబుతున్నా… ఈ రైతుబజార్లు, లేకపోతే చాపల మార్కెట్లు… వీటికి అస్సలు వెళ్లకండి కొన్నాళ్లపాటు. ఏమీ కొంపలు మునిగిపోవు. పచ్చి పులుసో, రసమో చేసుకుని, అన్నం వండుకుని తిని, చచ్చిపోకుండా బతికితే చాలు. ఎగ్స్ లాంటివి దొరికితే స్టాక్ పెట్టుకోండి. చికెన్ కూడా తెచ్చి పెట్టుకోవచ్చు. ఫ్రిజ్ సౌకర్యం ఉన్నవాళ్లు వన్ వీక్, టెన్ డేస్ వరకు పెట్టుకోవచ్చు. ప్రభుత్వాలు చెప్పే మాటలు, లేకపోతే విశ్లేషకులు, ఇంకెవరో, ఇంకెవరో చెప్పేవి నమ్మకండి. డేంజర్లో ఉన్నాము అనే చెప్పే ఒక్క మాటే నమ్మండి. ఎందుకంటే ప్రపంచానికి నాయకత్వం వహిస్తున్న ఐక్యరాజ్య సమితే చెబుతోంది. ఇది రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి క్రైసిస్ అని చెబుతోంది. ఇటువంటి విపత్తుతో పోలుస్తున్న నేపథ్యంలో ఇక్కడున్నవాళ్లు ఏదో చెప్పేస్తే, ఏదో నమ్మేస్తే మనం, మనల్ని మనం మోసం చేసుకున్నవాళ్లమవుతాం. దయచేసి మళ్లీ చెబుతున్నా, వియ్ ఆర్ ఇన్ డేంజర్ జోన్’’ అని వెంకటకృష్ణ ప్రజలకు హితవు చెప్పారు.

జర్నలిస్టు వెంకటకృష్ణ చేసిన ప్రసంగపు వీడియోను దిగువన వీక్షించండి.

Comments are closed.

Exit mobile version