‘నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలియదా?… నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలియకుండా, ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారయా మీరు…? పోలీసులన్నాక ఫోర్ ట్వంటీ ఎవడు? జంటిల్మెన్ ఎవడు? వెధవ ఎవడు…? తెలుసుకోవాలి. ఐ వాంట్ టూ టాక్ టూ నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నౌ…యస్?’ అంటాడు అదేదో సినిమాలో కమెడియన్ బ్రహ్మానందం. కాకపోతే అది సినిమా…బ్రహ్మి కామెడీకి కడుపుబ్బా నవ్వుకునే ఈ సీన్ బాగా పాపులర్ కూడా..సీన్ కట్ చేస్తే…
ఇదిగో… ఇతనెవరో ముజాఫర్ బాయ్ అట…నోరు తెరిస్తే ఒకటే బూతులు..ఎవడ్రా మాట్లాడేది..నేన్ ఎవరైతే ఏందిరా…లం…కొడకా..? తమాషాలు….(బూతు)? అసలు. ఏం జేస్తున్నవ్ అసలు.. ఉండాలనుకుంటున్నవా? పోవాలనుకుంటున్నవా? ల్యాండ్ విషయం రా…(బూతు). యాక్షన్ ….(బూతు)? నీకూ…ముజాఫర్ భాయ్ అంటే ఎవ్వల్ తెల్వదా? అది కాదురా లం…కొడకా…ఎందుకు సతాయిస్తున్నవ్… గది జెప్పు? ఆయన పవర్ ఏందో నీకు తెల్వదా? విలేకరి కాదురా? ఆయన పవర్ ఏందో తెలుసా నీకు? ఎందుకు సతాయిస్తున్నవ్ ఆయనను? ల్యాండ్ సెటిల్మెంట్ చేస్కో అంటే…ఎందుకు చేస్కుంట లేవ్? ఏం జాతిరా నీది…ఏం జాతి? ఉండాలని ఉందా? పోవాలని ఉందా.. నీకు? ఇక్కడా…ముజాఫర్ భాయ్ అంటే రాయికల్లో హడల్…అర్థమైందా? డాన్ అని…? ఆయనతోని నువ్ బెట్టుకుంటవా? ఎన్నిసార్లు జెప్పిండు? ఉండాలనిపిస్తుందా? పోవాలనిపిస్తుందా…పైకి? ఆయన గురించి నీకు తెల్వదా? డీప్ గా తెల్వదా? తెల్సుకోలేదా ఇప్పటిదాకా నువ్వు? ఎమ్మార్వో అయినా, ఎస్ ఐ అయినా…ఎవలయినా ఆయన శేతుల గడగడలాడ్తరు అర్థమైందా? నువ్వూ…లీగల్ గా బోయి…కోర్టుల జేస్కుంటా… ఆడ జేస్కుంటా? ఈడ జేస్కుంటా? అంటే ఏం పీకలేవ్…అర్థమైందా? నువ్వు కోర్టుకు పోయినా…యాడికి బోయినా…ఇక్కడికొచ్చి ముజఫర్ భాయ్ కాళ్లు మొక్కవలసిందే..అర్థమైందా? రెండ్రోజులల్ల సెటిల్ చేస్కోక పోతే… మొత్తం నీ ఫ్యామిలీని లేపేస్తా? రెండే రోజుల్లో లేపేస్తా? ఏం న్యాయం రా..బాయ్…సెటిల్ చేస్కోకుంటే లేపేస్తా? నీది తక్కువ జాతిరా? అందుకే ఆ జాతిలో పుట్టినవ్ రా? కలెక్టర్, ఎస్పీ, ఎమ్మర్వో, ఎస్ఐ ఎవరూ ఏం పీకలేరు…అర్థమైందా? ఇక్కడా ముజఫర్ భాయ్ పవర్ అది…అర్థమైందా? ఆషామాషీ కాదు..గుర్తు పెట్టుకో…మంచిగ…అదే భూమిలో నీ తాత పక్కకు మీ అందరి సమాధి కట్టిస్తా…గుర్తు పెట్టుకో…సరేనా? రెండే రోజులు టైమిస్తున్నా? అంటూ ఓ గొంతు మరో దళితున్ని నానా దుర్భాషలాడుతూ బెదిరించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తనను దేవుడు పుట్టించాడని, జాతి గురించి మాట్లాడవద్దని, తనకు చిన్న పిల్లలు ఉన్నారని ఆ దళితుడు ప్రాధేయపడుతున్నా ముజఫర్ భాయ్ ఎక్కడా వినిపించుకోలేదు.
ఇంతకీ ముజఫర్ భాయ్ ఎవరో చెప్పలేదు కదూ? పెద్దపల్లి మాజీ ఎంపీ, ప్రస్తుతం బీజేపీ నేత వివేక్ వెంకటస్వామికి చెందిన సంస్థలో విలేకరట. జగిత్యాల జిల్లా రాయికల్ కేంద్రంగా ఇతను విలేకరి గిరి ‘వెలుగు’ బెడుతున్నాడట. రిజస్ట్రేషన్ ఆఫీసు సమీపాన డాక్యుమెంట్ రైటర్ కూడానట. ఎవడు ఎటువంటి వాడో తెలుసుకోకుండా మీకు జాబ్స్ ఇచ్చిన వెధవ ఎవడు అని కమెడియన్ బ్రహ్మానందం ‘నెల్లూరు పెద్దారెడ్డి’ సీన్లో ప్రశ్నిస్తాడు….తెలిసిందే కదా? వివేక్ గారూ… ఎవరు ఎటువంటి వారో తెలుసుకోకుండా మీ సంస్థలోని కొందరు పెద్ద ఉద్యోగస్తులు విలేకరి గిరి ఉద్యోగాలిస్తున్నట్లు ముజఫర్ భాయ్ ఆడియో ఉదంతం ప్రశ్నిస్తోంది. కాస్త ఆ ఆడియోను మీరు కూడా వినాలని మీ పత్రిక పాఠకులు, వీ6 వీక్షకులు కోరుకుంటున్నారు. చట్టం తన పని ఎలాగూ చేస్తుంది…కానీ… మీరు కూడా ముజఫర్ భాయ్ పై చర్య తీసుకుంటారని మీ పత్రిక పాఠకులు ఆశిస్తున్నారు.