ఈనెల 5న బుధవారం రాష్ట్ర మంతివర్గ సమావేశం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్ లో జరుగుతుంది. సెక్రటేరియట్ నూతన భవన సముదాయం నిర్మాణం, నియంత్రిత సాగు పద్ధతిలో వ్యవసాయం, కరోనా పరిణామాలు, ఈ నేపథ్యంలో విద్యారంగంలో తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించి, నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.