కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ఈనెలాఖరు వరకు లాక్ డౌన్ అమల్లోనే ఉందిగా? లాక్ డౌన్-5లో కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో అనేక వ్యాపార కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతులిచ్చింది కదా? ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది నిజమే కదా? సడలింపులైతే ఇచ్చారుగాని ‘లాక్ డౌన్’ను పూర్తిగా ఎత్తేయలేదుగా? ఈ ప్రశ్నల్లో ఎటువంటి డౌట్లు లేవుగా? ఏమిటీ ప్రశ్నలు? ఎందుకీ సందేహాలు…? అనుకుంటున్నారా?
మళ్లా లాక్ డౌన్ దిశగా ఆలోచిస్తున్నామని తెలంగాణా మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ప్రకటించినట్లు హెచ్ఎంటీవీ ఓ వార్తా కథనాన్ని ప్రసారం చేసింది. రెండు రోజుల్లో సీఎం కేసీఆర్ ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటారని తలసాని చెప్పినట్లు ‘బ్రేకింగ్’ న్యూస్ ప్రసారం చేసింది. దీంతో మళ్లీ ‘లాక్ డౌన్’విధింపు అంశంపై భిన్నకథనాలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి.
ఈనెలాఖరు వరకు లాక్ డౌన్ అమల్లో ఉండగానే మళ్లీ లాక్ డౌన్ విధించడమేంటి? అంటే ప్రస్తుతం లాక్ డౌన్ అమల్లో లేదా? ఉంటే ‘లాక్ డౌన్’లో మళ్లీ లాక్ డౌన్ విధిస్తారా? ఇవీ తాజా ప్రశ్నలు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ‘మళ్లీ లాక్ డౌన్’ విధింపునకు సంబంధించి ఏమన్నారో దిగువన గల ‘లింక్’లో చూడండి.